- ఒకే దేశం… ఒకే ఎన్నిక ప్రమాదకరమైనదన్న బీవీ రాఘవులు
- జమిలి ఎన్నికలను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి
- అభివృద్ధికి ఎన్నికల కోడ్‌కు ముడి పెట్టవద్దన్న కమ్యూనిస్ట్ నేత
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నికను తీసుకు రావాలని భావిస్తోందని, కానీ ఇది చాలా ప్రమాదకరమైనదన్నారు. ఒకే దేశం… ఒకే ఎన్నికను దేశంలోని చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నికను వ్యతిరేకించండి’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అభివృద్ధికి ఎన్నికల కోడ్‌కు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసే హక్కు ప్రజలకే ఉందన్నారు. ఒకే దేశం… ఒకే ఎన్నిక తర్వాత అధ్యక్ష తరహా పాలన వస్తుందన్నారు.