Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్… హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు…

  • నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కేఏ పాల్ పిటిషన్
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు ఆదేశం
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, హైడ్రాకు ఆదేశాలు

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా నగరంలో కూల్చివేతలు చేపడుతోందంటూ, ఈ కూల్చివేతలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయం చూసుకునే వరకు బాధితులకు సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది.

పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. మూసీ బాధితులకు ఇళ్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అయితే, మూసీ బాధితులకు ఇళ్ళు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నట్లు అడిషనల్ అడ్వోకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్లు…

Ram Narayana

పిల్ల‌ల‌ను అన్ని షోల‌కు అనుమ‌తించాలి: తెలంగాణ హైకోర్టు!

Ram Narayana

లగచర్ల, హకీంపేట భూసేకరణపై హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!

Ram Narayana

Leave a Comment