- కెనడాలోని టొరంటోలో ఘటన
- టెస్లా కారు డివైడర్‌ను ఢీకొనడంతో చెలరేగిన మంటలు
- అందులో చిక్కుకుని నలుగురు భారతీయుల మృతి
- మృతుల్లో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన ఇద్దరు తోబుట్టువులు
- 20 ఏళ్ల యువతిని కాపాడిన ఓ వాహనదారుడు
కెనడాలోని టొరంటో సమీపంలో టెస్లా కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత కారు మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు భారతీయులు సజీవదహనమయ్యారు.
గుజరాత్‌లోని గోద్రాకు చెందిన తోబుట్టువులు కేటా గోహిల్ (30), నిల్ గోహిల్ (26) మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తుండగా కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారు బ్యాటరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనం అయ్యారు.
ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. టెస్లా డివైడర్‌ను ఢీకొట్టింది, దాని తర్వాత దాని బ్యాటరీకి మంటలు అంటుకున్నాయి, ఘటనా స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారు.
20 ఏళ్ల యువతిని కాలిపోతున్న కారు నుండి అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కాపాడాడు. ఆమె ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలు వాహనదారులు ప్రయత్నించారు. కానీ, అప్పటికే భారీగా మంటలు అంటుకోవడంతో వీలు పడలేదని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
కెనడాలో ఈ ఏడాది జులైలో ఇదే తరహా మరో ఘటన జరిగింది. ఈ ఘటనలో పంజాబ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న కారు హైవేపైకి దూసుకెళ్లడంతో బోల్తాపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.