ఖమ్మం నుంచి హైద్రాబాద్ కు నాన్ స్టాప్ బస్సు లు …ఎల్బీనగర్ కు ప్రయాణం 3 గంటలు!
దిల్ షుక్ నగర్ వరకు నాన్ స్టాప్ …
సూర్యాపేటలో ఆగడం వల్ల సమయం ఎక్కువ పడుతుండటంతో గమనించిన ఆర్టీసీ అధికారులు …
ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణ సమయం తగ్గిస్తూ నూతనముగా ఖమ్మం నుండి హైదరాబాదుకు కొత్త రాజధాని ఏసి నాన్ స్టాప్ బస్సులను ది.28.10.2024 నుండి నడుపుటకు నిర్ణయించడమయినది.
కొత్త రాజధాని ఏసీ బస్సులు
ఖమ్మం నుండి ఎల్బీనగర్ కు ప్రయాణ సమయము మూడు గంటలు మాత్రమే
బస్సులో సెల్ఫోస్ ఛార్జింగ్ పాయింట్ లు కలవు
వాటర్ బాటిల్స్ ఇవ్వబడును
ఖమ్మం నుండి దిల్ సుఖ్ నగర్ నాన్ స్టాప్ రాజధాని ఏసీ బస్సుల సమయాలు :- 04.00 ,05.00, 06.00, 07.00, 16.00, 17.00, 18.00, 19.00
హైదరాబాద్ (ఎంజీబీఎస్ నుండి ఖమ్మం నకు నాస్ స్టాప్ రాజధాని ఏసీ బస్సుల సమయాలు:-
05.00, 06.00, 07.00, 08.00, 16.30, 17.30, 18.30, 19.30
కావున ప్రయాణికులు ఈ సదవకాశమును వినియోగించుకోగలరు మరియు ప్రయాణీకుల ఆదరణ ప్రకారం మరిన్నీ సర్వీసులుపెంచబడును
నాన్ స్టాప్ బస్సులే కాకుండా అదనంగా 24/7 ప్రతి గంటకు ఒక ఏసి బస్సు కలదు.
అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కొరకు www.tgsrtcbus.in లాగిన్ కాగలరు