- సల్మాన్‌ఖాన్‌తో వివాదం వ్యక్తిగతం కాదు… బిష్ణోయ్ తెగ సమస్య అన్న టికాయత్
- సల్మాన్‌ఖాన్ బిష్ణోయ్ తెగ దేవాలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని సూచన
- అప్పుడే బిష్ణోయ్ తెగ కోపం తగ్గి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచన
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఓ సూచన చేశారు. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌తో ఉన్న వివాదం వ్యక్తి సమస్య కాదని, ఇది బిష్ణోయ్ తెగకు సంబంధించినదని పేర్కొన్నారు. కాబట్టి బిష్ణోయ్ తెగకు సల్మాన్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తెగకు క్షమాపణలు చెబితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.
బిష్ణోయ్ తెగతో సల్మాన్‌కు ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోందని, కాబట్టి బిష్ణోయ్ తెగకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి చేసిన తప్పుకు సల్మాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టికాయత్ సూచించారు. అలా చేస్తే ఆ తెగకు ఆయనపై ఉన్న కోపం పోతుందన్నారు. ఆయన క్షమాపణ చెప్పకుండా అలాగే ఉంటే సమస్య ఇంతటితో ఆగిపోదని హెచ్చరించారు. ఇది ఆయన ప్రాణాలకు కూడా ముప్పు తేవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గురించి రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ… వారు దుర్మార్గులని పేర్కొన్నారు. జైల్లో ఉండి కూడా గ్యాంగ్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. బిష్ణోయ్ ఎప్పుడు, ఎలాంటి హాని తలపెడతాడో తెలియదని, కాబట్టి సల్మాన్‌ఖాన్ క్షమాపణలు కోరితే ప్రశాంతంగా ఉండవచ్చునని పేర్కొన్నారు.