Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ద్రవిడియన్ పేరుతో లూటీ చేస్తున్నారు: స్టాలిన్ ప్రభుత్వంపై హీరో విజయ్ నిప్పులు…

  • దేశాన్ని విభజించే శక్తులు, అవినీతికి పాల్పడేవారు మాకు శత్రువులన్న విజయ్
  • ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తాము వేరుగా చూడమని వెల్లడి
  • బరిలోకి దిగిన తర్వాత ఎవరికీ బయపడేది లేదన్న టీవీకే పార్టీ చీఫ్ విజయ్

ద్రవిడియన్ మోడల్ పేరుతో లూటీ చేయడాన్ని సహించేది లేదని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ అన్నారు. విజయ్ పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారి విల్లుపురంలో ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై నిప్పులు చెరిగారు. వివిధ అంశాలతో దేశాన్ని విభజించే శక్తులు, అవినీతికి పాల్పడేవారు తమ పార్టీకి శత్రువులు అన్నారు.

ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తమ పార్టీ వేరుగా చూడదని స్పష్టం చేశారు. ఈవీఆర్‌ పెరియార్‌, కె.కామరాజ్‌ లాంటి నేతల ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఏర్పడిందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వారు ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా పిలుస్తున్నారని అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, వారు రాజకీయ రంగంలో ప్రవేశించిన అనంతరం కూడా తమ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులను దోచుకున్నారని పేర్కొన్నారు.

తాను పేరు పెట్టకుండా విమర్శలు చేస్తున్నానంటే అది భయంతో కాదని, ఒక గౌరవప్రదమైన రాజకీయాలను చేసే లక్ష్యంతో తాను ఇక్కడకు వచ్చానని వెల్లడించారు. రాజకీయాలు పాములాంటివని… తాను రాజకీయాల్లో చిన్నపిల్లాడినే కావచ్చు… తనకు అనుభవమూ లేకపోవచ్చు… కానీ బరిలోకి దిగిన తర్వాత ఎవ్వరికీ భయపడేదే లేదన్నారు.

Related posts

 హర్యానాలో బీజేపీ గెలుపు… కాంగ్రెస్, ఠాక్రే శివసేన మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

తనపై పోటీ చేస్తున్న బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే… ఇదిగో వీడియో

Ram Narayana

మోదీ కేబినెట్లో సహాయమంత్రి పదవికి నో చెప్పిన ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్!

Ram Narayana

Leave a Comment