ఖమ్మం కాంగ్రెస్ లో విషాదం… కార్పొరేటర్ మలీదు గుండెపోటుతో జగన్ మృతి
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ కార్పొరేటర్
జగన్ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పరవంతమైన తుమ్మల
జగన్ మృతికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన తుమ్మల
ఖమ్మంలో కాంగ్రెస్ లో విషాదం నెలకొన్నది …మూడవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ మలీదు జగన్ గుండెపోటుతో మృతి చెందారు …నిత్యం తన డివిజన్ లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరానికి కృషి చేసే జగన్ ఆకస్మిక మృతి వార్త డివిజన్ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది ….జగన్ నగరంలో ప్రజలు తెలిసి వాడు కావడంతో ఆయన మృతి వార్త విషాదాన్ని నింపింది …ఆదివారం ఉదయం 10 గంటలుకు తన నివాసంలో గుండె పోటు తో స్పృహ తప్పి పడిపోయిన జగన్ స్థానికి ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు …అక్కడ ఈసీజీ , టు డి ఎకో ,త్రేడ్ మిల్ , ఏంజియో పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు మూడు వాల్స్ పూర్తిగా బ్లాక్ అయ్యాయని వెంటనే ఆపరేషన్ చేయాలనీ హైద్రాబాద్ కు తీసుకోని వెళ్లాలని డాక్టర్లు సూచించడం జరిగింది .. మూడు వాల్స్ బ్లాక్ అవ్వడంతో కండిషన్ క్రిటికల్ ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదారాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ..సోమవారం చికిత్స అందిస్తుండగా ఉదయం 9:30 గంటలకు మృతి చెందారు …జగన్ మృతి చెందిన విషయాన్ని అధికారికంగా ప్రకటించని కాంగ్రెస్ నేతలు…మృతదేహం హైద్రాబాద్ కిమ్స్ లో ఉంది …మంగళవారం ఖమ్మం తీసుకోని రానున్నారు … విదేశాల లో ఉన్న జగన్ కుమారుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబీకుల…రేపు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది …
మంత్రి తుమ్మల దిగ్బ్రాంతి …కన్నీటి పర్యంతం…
కిమ్స్ హాస్పటల్ లో జగన్ భౌతిక కాయాన్ని సందర్శన
ఖమ్మం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేటర్ మలీద్ జగన్ మృతి వార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు …హుటాహుటిన కిమ్స్ హాస్పటల్ కు వెళ్లి
కార్పొరేటర్ మలీదు జగన్ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో సందర్శించి నివాళులు అర్పించారు ..తాను ఖమ్మంలో ఉంటె రోజు వచ్చే కలిసే జగన్ విగత జీవుడై ఉండటాన్ని చూసిన మంత్రి తుమ్మల కన్నీటి పర్యంతం అయ్యారు .. మలీదు జగన్ అకాల మరణం ఎంతో బాధగా ఉందన్నారు …జగన్ సేవలు మరువలేనివి డివిజన్ లో ప్రజా సమస్యల పై జగన్ నిత్యం పని చేసేవాడని అన్నారు …పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకుణ్ణి కోల్పోయమన్నారు …జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ..