భర్తను చంపించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గడసరి భార్య …
వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడి
కర్ణాటక లోని కొడుగు జిల్లా కాపీ తోటలో చంపి కాల్చిన వైనం
కారు అక్కడే వదలడంతో అది రమేష్ కారని గుర్తించి దర్యాప్తు
విచారణలో షాకింగ్ విషయాలు ..
54 యేళ్ల రమేష్.. తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త..అక్టోబర్ 8న అదృశ్యమైనట్లు అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. రమేష్ ను కొంతమంది వ్యక్తులు హత్య చేసి..శవాన్ని కర్ణాటలోని కొడగు జిల్లాలోకాఫీ తోటల్లో తగల బెట్టినట్లు వెల్లడైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రమేష్ హత్య వెనక కీలక సూత్రధారి, పాత్రధారి అతని భార్యే నని భయంకర నిజం వెలుగులోకి వచ్చింది.
మూడు వారాల క్రితం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని కాఫీ తోటల్లో గుర్తు తెలియని, కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫులేజీల్లో సంఘటనా స్థలంలో కనిపించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ శవం.. తెలంగాణకు చెందిన రమేష్ దిగా గుర్తించారు. రమేష్ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి అతని భార్యపై అనుమానం ఉన్న పోలీసులకు అతని శవం దొరకడంతో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. డబ్బుకోసం రమేష్ ను అతని భార్య నిహారిక, ఆమె ప్రేమికుడు నిఖిల్, మరో నిందితుడు అంకుర్ కలిసి దారుణం చంపినట్లు విచారణలో తేలింది. రమేష్ ను హత్య చేసి పథకం ప్రకారం మృతదేహాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి దాదాపు 800 కిలోమీటర్లదూరంలో ఆనవాళ్లే లేకుండా కాల్చేశారు. కర్ణాటకపోలీసులకు కాఫీ తోటల్లో దొరికిన మృతేదేహం రమేష్ ది అని రుజువు కావడంతో అతని భార్య నిహారికను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. పెళ్లికి ముందు జైలుకెళ్లొచ్చిన నిహారిక.. రమేష్ కు రెండో భార్యగా వివాహం చేసుకుంది. రమేష్ వ్యాపార వేత్త కావడంతో విలాసవంతమైన జీవితాన్ని అందించాడు. ఆమె దానికి అలవాటు పడింది. అయితే ఇటీవల కాలంలో రమేష్ ను అతని భార్య నిహారిక రూ.8కోట్ల రూపాయలు కావాలని అడిగింది. రమేష్ డబ్బు ఇచ్చేందుకు తిరస్కరించాడు. నిఖిల్ , అంకుర్ లతో కలిసి పథకం ప్రకారం రమేష్ హత్యచేసేందుకు కుట్ర పన్నింది. నిందితుల్లో నిఖిల్ తో నిహారికకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నిఖిల్ స్నేహితుడైన అంకుర్ తో కలిసి రమేష్ ను హత్య చేశారు. ఉప్పల్ లో నివాసం ఉంటున్న రమేష్ ను గొంతు కోసి చంపి..కారులో కర్ణాటకలోని కొడగుకు తీసుకెళ్లారు. అక్కడ కాఫీ ఎస్టేట్ లో మృతదేహానికి దుప్పటికప్పి నిప్పంటించారు. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లు వ్యాపారవేత్త రమేష్ కనిపించకుండాపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ హత్యకేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. అతని భార్య నిహారిక, డాక్టర్ నిఖిల్,అంకుర్ లతో పాటు అనుమానితులను అరెస్ట్ చేశారు