Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి …జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …

రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణ , సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి… మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు …ఈసందర్భంగా సీఎం పొంగులేటి శుభాకాంక్షలు తెలిపి ఒక మొక్కను బహుకరించారు … ఉమ్మడి జిల్లా వ్యాప్తితంగా అట్టహాసంగా నిర్వహించారు …గతంలో ఎన్నడూ లేని విధంగా కేక్ కట్టింగ్ లు , అన్నదానాలు , రక్తదాన శిభిరాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి , ఆటల పోటీలు ఒకటేమిటి బహుముఖ కార్యక్రమాలుజరిపి తమ అభిమానాన్ని
చాటుకున్నారు .. ఎక్కడిక్కడ తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు . కాంగ్రెస్ నేతలు, పొంగులేటి అభిమానులు సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో ఉమ్మడి జిల్లా వ్యాపితంగా సంబరాలు జరిగాయి … రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలతో ఉమ్మడి జిల్లాను హోరెత్తించారు . భారీ కటౌట్లు, ప్లెక్సీలు, హెూర్డింగ్ లను జిల్లా వ్యాపితంగా ఏర్పాటు చేశారు .. ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయం వద్ద అర్ధరాత్రి కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు …దీపావళి మూడు రోజులు ఉన్నప్పటికీ పొంగులేటి జన్మదినోత్సం సందర్భంగా ముందుగానే వచ్చినట్లు అయింది …

ఉదయం 09.00గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు . వందలాది మంది అభిమానులు రక్తదానం చేశారు .. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై ఖమ్మం ప్రధాన ప్రభుత్వాస్పత్రి వరకు కొనసాగింది . అనంతరం అక్కడ రోగులకు పండ్ల పంపిణీ చేశారు …ఉదయం 10.30గంటలకు దానవాయిగూడెం, రామన్నపేట కాలనీల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు .. 11.00గంటలకు ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్రోడ్ లో రక్తదాన శిబిరం, 11.30గంటలకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరం, మధ్యాహ్నం 12.30గంటలకు ఖమ్మంలోని జీవనసంధ్యా వృద్ధాశ్రమం, అన్నం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి . సాయంత్రం నాలుగు గంటలకు శీనన్న జన్మదిన వేడుకల సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు . కార్యక్రమం లో క్యాంపు కార్యాల ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు … రాత్రి 08.00గంటలకు ముదిగొండ వెంకటాపురంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ..ఇవేకాక ఇంకా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు . కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు …

మంత్రి పొంగులేటి జన్మదినోత్సవంలో పాల్గొన్న ఎంపీ రఘురాం రెడ్డి

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదినోత్సవoలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేత కేకు కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమo కోసం నిరంతరం పరితపించే నేత అని, ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ఖమ్మం, కూసునుంచి క్యాంపు కార్యాలయాల్లో….

మంత్రి పొంగులేటి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో పుట్టినరోజు సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బాణోతు విజయబాయి, గుమ్మా రోశయ్య, హరినాథబాబు, కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, కొప్పుల అశోక్, కొంగర జ్యోతిర్మయి, కీసర పద్మజా రెడ్డి, కర్లపూడి భద్రకాళి, పంతులు నాయక్, భీమనాథుల అశోక్ రెడ్డి, లింగాల రవికుమార్, గురుప్రసాద్, మియాభాయ్, కిలారు మనోహర్, ఉమ్మినేని కృష్ణ, కానుగుల రాధాకృష్ణ, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా వందలాది మంది పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జెండా ఊపి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలను నిర్వహించారు.

  • ఖమ్మం, పాలేరు నియోజకర్గాల్లో….
    ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో శీనన్న పుట్టిన రోజు సంబురాలను కోలాహలంగా నిర్వహించారు. రామన్నపేటలో బండి మనోజ్ ఆధ్వర్యంలో బొమ్మస్వామి గుడి వద్ద రక్తదాన శిబిరాన్ని, దానవాయిగూడెంలో చల్లా కృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం కైకొండాయిగూడెంలో నాగటి ఉపేందర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు, రక్తదాన శిబిరాలను చేపట్టారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని, రాజీవ్ గృహకల్పలో రూరల్ మండల కమిటీ, పీఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా మిషనరీ చారిటీలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఖమ్మంలోని జీవన సంధ్యా వృద్ధాశ్రమం, అన్నం ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బోనకల్, ముదిగొండ మండలాల్లోనూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కల్లూరు మండలం నారాయణపురంలో పొంగులేటి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ముగింపు రోజున విజేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Related posts

సాగు భూములకే రైతుబంధు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Ram Narayana

రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దు పాతవారికి యధాతధంగా వస్తాయి…సీఎం రేవంత్

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టితో టీయూడబ్ల్యూజే ఆధ్వరంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ హైలెట్స్ …

Ram Narayana

Leave a Comment