Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

వందేళ్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం …ఖమ్మంలో లోగో ఆవిష్కరించిన సీనియర్ నేత పువ్వాడ ..

వందేళ్ల ఉద్యమ చరితను నేటి తరానికి అందిద్దామని చరిత్రను తెలిపి నేటి తరాన్ని ఉద్యమం వైపు ఆకర్షించడంతో పాటు కార్యోన్ముఖులను చేయాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 1925 డిసెంబరు 26న ఆవిర్భావించిన భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమ విజయాలను చవిచూసిందని -లక్ష్యం దిశగా పయనించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని ఆయన తెలిపారు. డిసెంబరు 26 నుంచి జరగనున్న-శతాబ్ది ఉత్సవ లోగోను పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ నాయకులతో కలిసి స్థానిక గిరిప్రసాద్ భవన్లో ఆవిష్కరించారు. ఈ -సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యానికి పూర్వం ఆ తర్వాత అనేక నిర్బంధాలను చవిచూసిందన్నారు. పాలకులు కమ్యూనిస్టుల పట్ల వ్యతిరేకతతో నిషేధించిన ప్రజల కోసం పనిచేయడంలో ఏనాడు వెనుకంజ -వేయలేదన్నారు.

ఈ వందేళ్ల చరిత్రలో అనేక చారిత్రిక ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ నెలవైందన్నారు. రైతులు, కార్మికులు, -మహిళలు, యువజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని పువ్వాడ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ అని అప్పట్లో కాంగ్రెస్ బ్రిటిష్ వారితో లాబింగ్ జరుపుతున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ పోరాట నినాదాన్ని ఎత్తుకుని బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి -పంపించడం ద్వారానే సంపూర్ణ స్వాతంత్య్రం సాధ్యమవుతుందని చెప్పిందన్నారు. నిజాంను గద్దె దించే క్రమంలో జరిగిన సాయుధ పోరాటం ప్రపంచ పోరాట చరిత్రలో అగ్ర పదాన నిలిచిందని ఆయన తెలిపారు. నాలుగువేల మంది అమరులు బలిదానం చేశారని తద్వారా లక్షల ఎకరాల భూమిని పంచడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక పునర్జీవనానికి -అవకాశం దక్కిందని పువ్వాడ తెలిపారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు చేశామని సిపిఐ చేపట్టిన ప్రతి ఉద్యమం ఒక చారిత్రిక అంశంగా మారిందని దున్నేవానికే భూమి దక్కాలని పనిచేసే వానికి పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కమ్యూనిస్టు పార్టీ నినాదించిందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం కమ్యూనిస్టుపార్టీ పోరాడిందని ఇవాళ ప్రజలు అనుభవిస్తున్న హక్కులలో మూడొంతులు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే దక్కాయన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టుపార్టీ త్యాగాలను, ఉద్యమ చరిత్రను నేటి తరాలకు తెలియజేసి వారిని ఉద్యమం వైపు ఆకర్షించడంతో పాటు కార్యోన్ముఖులను చేయాలని పువ్వాడ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

-వాడ వాడలా శతజయంతి ఉత్సవాలు: బాగం

“సిపిఐ శత జయంతి ఉత్సవాలను వాడ వాడలా నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. డిసెంబరు 26 నుండి 2025 డిసెంబరు 25 వరకు ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించాలని జాతీయ -సమితి నిర్ణయించిందన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి కమ్యూనిస్టు సంబంధిత చరిత్ర ఉందని ఆ చరిత్రను నేటి తరాలకు తెలియజేయడమే శతజయంతి లక్ష్యమన్నారు. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 1/2

కమ్యూనిస్టులు కాస్త వెనకంజ వేసినా పురోగమనం తప్పదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఏపూరి లతాదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, బిజి క్లెమెంట్, రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, రవీంద్రబాబు, మేకల శ్రీను, సుధాకర్, తోట రామాంజనేయులు, మిడికంటి వెంకటరెడ్డి, మల్లికార్జున్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల ఉడుం పట్టు …

Ram Narayana

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్ ప్రెస్ కు హాల్ట్…ఎంపీ వద్దిరాజు వినతికి స్పందన

Ram Narayana

ఖమ్మంలో తుమ్మల …పువ్వాడల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం

Ram Narayana

Leave a Comment