Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

ప్రకంపనలు రేపుతోన్న జన్వాడ ఫామ్ హౌస్​ పార్టీ..

జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న రాజ్‌ పాకాల స్నేహితుడు, కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విజయ్‌ మద్దూరి ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఫామ్‌హౌజ్‌లో గేమ్‌ ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే ఛాన్స్​ ఉంది. ఫామ్‌హౌజ్‌లో పార్టీ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించిన సమయంలో అక్కడున్న సెల్​ఫోన్​ను ఓ మహిళ దాచి పెట్టింది. దానిని ఆదివారం నాడు విజయ్‌ మద్దూరి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న డాటా అధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొకైన్‌ మత్తుపదార్ధాలు​ తీసుకొచ్చి విజయ్‌ మద్దూరికి ఎవరు ఇచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాజ్‌ పాకాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ : మరోవైపు పోలీసుల నోటీసుల నేపథ్యంలో రాజ్‌ పాకాల రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్​ ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోలీసుల ఎదుట హాజయ్యేందుకు ఆయనకు రెండు రోజుల సమయం ఇచ్చింది. రాజ్‌ పాకాల తరఫున మయూర్‌రెడ్డి వాదనలు వినిపించగా, ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి రైడ్ చేశారన్నారు. ఆయన కంపెనీలో పని చేసే ఉద్యోగికి డ్రగ్స్‌ పాజిటివ్‌ వస్తే రాజ్‌ పాకాలను నిందితుడిగా చేర్చారని కోర్టుకు వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని, ఇవాళ ఉదయం 9.30కి నోటీసులు పంపించి.. 11 గంటలకు విచారణకు రమ్మన్నారని కోర్టుకు ఆయన తెలిపారు.

పోలీసుల తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ ఖాన్‌ వాదనలు వినిపించారు. అరెస్టు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మద్యం సీసాలు లభించడంతోపాటు విజయ్‌ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్‌ టెస్ట్​లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే రాజ్‌ పాకాలకు 41ఏ నోటీసులు ఇచ్చామని ఏజీ వివరించారు. ఈ మేరకు దర్యాప్తులో తీవ్ర నిర్ణయాలేమీ తీసుకోబోమని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు పిటిషనర్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్… హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు…

Ram Narayana

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. బడా బాబులకు చురక…

Ram Narayana

Leave a Comment