Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హుజూర్ నగర్ 6టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నం …జర్నలిస్టుల నిరసన

హుజూర్ నగర్ లో 6 టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) తీవ్రంగా ఖండించింది . ఇది అత్యంత దుర్మార్గం ఇలాంటి చర్యలు సభ్యసమాజానికి సిగ్గుచేటు … పాశవికచర్య, దుండగులు ఎంతవారైనా పట్టుకొని చట్టప్రకారం శిక్షంచాలన్నారు … ఇది ముమ్మాటికీ భావస్వేచ్ఛ ప్రకటనను హరించడమేనన్నారు .. ఈమేరకు మంగళవారం హుజూర్ నగర్ లో సర్కిల్ కార్యాలయం ,పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు …సందీప్ పై హత్యాయత్నం చేసిన దుండగులను పట్టుకొని కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు ..ఈసందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు .. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడులు జరిగితే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. 6టీవీ వెచ్చ సందీప్ పై కత్తులతో హత్యాయత్నం చేసిన వ్యక్తులను, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన సందీప్ ను కత్తులతో దాడి చేసి గాయపడిన మతతత్వ వ్యక్తులను అరెస్టు చేసే శిక్షించాలన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో జర్నలిస్టుల రక్షణ చట్టంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిఎస్పి శ్రీధర్ రెడ్డి, సిఐ చరమందరాజు కి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దొంతగాని రాజా రమేష్, బసవొజు శ్రీనివాస చారి, కిత రామనాథం, రాంప్రసాద్ గౌడ్, జానీ పాషా, త్రిపురం రమేష్ రెడ్డి, షేక్ నాగు మీర, ఆత్కూరి వెంకటేశు, పండ్ల నాగరాజు, దేవర వెంకటరెడ్డి, కాంపాటి సందీప్, వసుపు జయరాజు రామయ్య, తండు నరేష్, పండు వెంకన్న, పాలెల్లి నరేష్, , ఇట్టుమల్ల రామకృష్ణ, నరేందర్, పెందుర్తి సతీషు, నక్క నరేష్, బండి నాగేశ్వరావు, జట్టి తేజస్, వట్టికూటి మహేష్ , పాల్గొన్నారు.

Related posts

గోల్కొండ కోట చరిత్ర తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షో… కార్యక్రమంలో కిషన్ రెడ్డి, చిరంజీవి

Ram Narayana

గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …

Ram Narayana

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana

Leave a Comment