అంతర్జాతీయం

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం .. అమెరికాకు 60 విమానాలు రద్దు…

  • నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు యూఎస్‌కి 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
  • నిర్వాహణ, ఎయిర్ క్రాఫ్ట్ సమస్యల కారణంగా రద్దు చేసినట్లు ప్రకటన 
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడి

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. నిర్వాహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకూ భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. 

కస్టమర్లకు సమాచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూపు ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ – చికాగో రూట్‌లో 14 విమానాలు, ఢిల్లీ – వాషింగ్టన్ రూట్‌లో 28, ఢిల్లీ – ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమానాలు, ముంబయి – న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ – నెవార్క్ రూట్‌లో రెండు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రిఫండ్‌ని ఆఫర్ చేస్తోంది. 

Related posts

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 42 మంది భారత యాత్రికుల సజీవ దహనం..

Ram Narayana

16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం.. బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం!

Ram Narayana

ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను

Ram Narayana