Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

చంద్రబాబుకు కేటీఆర్ ప్రశంస …తపన ఉన్న నాయకుడని కితాబు..!

హైదరాబాద్‌ను అమరావతి దాటేస్తుందా? అంటే… కేటీఆర్ సమాధానం ఇదే

  • చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడన్న కేటీఆర్
  • హైదరాబాద్ సొంతంగా అభివృద్ధి చెందిందన్న కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదని వ్యాఖ్య

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అమరావతి దాటేస్తుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయన ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ఎక్స్ వేదికగా అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్… ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి తెలంగాణ రాజధానిని దాటేస్తుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు.

చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడని, అయితే హైదరాబాద్ సొంతంగానే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును కూడా దాటేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందో తెలియదని అభిప్రాయపడ్డారు.

తమిళనాడులో పార్టీని స్థాపించిన హీరో విజయ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. 2028లో తాను మళ్లీ మంత్రిగా కనిపించే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, అక్కడ ప్రాంతీయ పార్టీలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Related posts

ఇక సెలవు… జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను: పోసాని…

Ram Narayana

భోరున విలపించిన నటీ అనసూయ…

Ram Narayana

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!

Ram Narayana

Leave a Comment