సంగం డైరీ వ్యవహారంలోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే!
-సంగం డెయిరి కేసులో ఏసిబి సెర్చ్ వారెంట్ పిటీషన్ ను కొట్టివేసిన కోర్టు
-మరి కొంత కాలం తనిఖీలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన ఏసిబి
-తనిఖీలు అవసరం లేదని పిటీషన్ ను కొట్టివేసిన ఏసిబి ప్రత్యేక న్యాయస్థానం
సంగం డెయిరిలో తనిఖీల కోసం సెర్చ్ వారెంట్ రీకాల్ చేయాలని కోరుతూ అవినీతి నిరోదక శాఖ వేసిన పిటిషన్ ను విజయవాడ ఏసిబి ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. సంగం డెయిరిలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన ఏసిబి అధికారులు ఏప్రిల్ 23 నుంచి మే 16 వరకు సంగం డెయిరిలో తనిఖీలు జరిపిన విషయము విదితమే ఈ తనిఖీలు సంధర్భంగా వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఏసిబి అధికారులు ఈ తనిఖీలలో పాల్గొని డెయిరికి చెందిన పలు రికార్డులను స్వాదీనం చేసుకున్నారు. తనఖీల నేపద్యంలో ఏసిబి అధికారులు పరిధి దాటి వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సంగం డెయిరిలో మరి కొంతకాలం తనిఖీలు జరపాల్సిన అవసరం ఉందని అందుకు తగిన అనుమతి కోరుతూ గత నెల17న విజయవాడ అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక న్యాయస్థానంలో ఏసిబి పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ఏసిబి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వి .శ్రీనివాసఆంజనేయమూర్తి సోమవారం ఏసిబి వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్యులు ఇచ్చారు. గతంలో 24 రోజుల పాటు సంగం డెయిరిలో తనిఖీలు జరిగాయని ఈ సందర్బంగా సంగం డెయిరికి చెందిన పలు రికార్డులను స్వాదీనం చేసుకుని పరిశీలిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన కోర్టు ఇక ముందు సంగం డెయిరిలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడుతూ ఏసిబి వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసు లో సంగం డెయిరి తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, గొట్టిపాటి రామకృష్ణప్రసాదు ఏసిబి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూ టర్ వాదనలను వినిపించారు.