Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జర్నలిస్ట్ ల రక్షణకోసం ఐజేయూ అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్..

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశాలు గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి . ఈ సమావేశాలకు అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుభోద్ అనియాల్
హాజరయ్యారు .అంతకుముందు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు . ఈ డిమాండ్ పై జర్నలిస్టు సమాజం లో చర్చ జరుగుతుందని తమ సంఘం దీనిపై వివిద రూపాల్లో ఆందోళనలు చేపట్టిందని తెలిపారు. జర్నలిస్ట్ లకు స్వేచ్ఛకావాలని అందుకు తాము కట్టుబడి ఉన్నామని చెపుతున్న పాలకులు రక్షణ చట్టం చేయకపోవడం విచారకరమన్నారు.

జర్నలిస్టులకు 1955లో ఆనాటి పార్లమెంటు చేసిన చట్టం నేడు మరింత పటిష్టంగా తయారు చేయాల్సిన బదులు అందుకు విరుద్ధంగా చేయడం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు .ఈ బిల్లును దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తమ సంఘం కూడా దీనిపై నిరసనలు, ఆందోళనలు చేపట్టిందన్నారు. ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న ఈ బిల్లును తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం శోచనీయమన్నారు. గత చట్టంస్థానే కొత్త చట్టం వస్తుదంటే గతం కంటే ఎక్కువ ఉపయోగాలు జర్నలిస్టులకు ఉండేలా బిల్లు ఉండాలి తప్ప గతంలో ఉన్న సౌకర్యాలను తగ్గిస్తూ నిర్ణయాలు చేయడం తగదని హితవు పలికారు.

ఎవరికోసం అయితే బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందో సంబంధిత వర్గాలైన జర్నలిస్టు సమాజాన్ని, సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. కచ్చితంగా జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

15 సంవత్సరాల క్రితం వేజ్ బోర్డు రద్దు అయిందని నాటినుండి నేటి వరకు వేజ్ బోర్డు గురించి పాలకులు పట్టించుకోకపోవడం జర్నలిస్టులపై వారికున్న ప్రేమను తెలియజేస్తుందన్నారు .వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని పునః పరిశీలించడంతోపాటు జర్నలిస్టులకు మేలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించి బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని కోరారు జర్నలిస్టులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని వ్యాపారులు ,రాజకీయ నాయకులు, మాఫియా జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని వీటిని అరికట్టేందుకు చర్యలు లేక పోవడం దారుణమని అన్నారు.

ప్రజాస్వామ్యంలో పత్రికకు స్వేచ్ఛ లేకపోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు జర్నలిస్టులకు పకడ్బందిగా రక్షణ చట్టం తేవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఇందుకోసం తమ సంఘం కార్యాచరణ రూపొందించి జర్నలిస్టుల హక్కుల కోసం రక్షణ చట్టం కోసం ,వేతన చట్టం, మీడియా కమీషన్ కోసం ఆందోళనలు చేపడుతుందని పేర్కొన్నారు… సమావేశంలో సెక్రటరీ జనరల్ బల్వీందర్ జమ్మూ , మాజీ అద్యక్షులు ఎస్ ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి జయ్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ అద్యక్ష కర్యదర్శులు ఉమాశంకర్ మోహతా, గిరీష్ పంత్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజీద్,కార్యవర్గసభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, తెలంగాణ అద్యక్ష ప్రధానకార్యదర్శులు కె.విరాహత్ అలీ , కె.రాంనారాయణ ఎపీ అద్యక్ష ప్రధానకార్యదర్శులు ఐ వి సుబ్బారావు, చందు జనర్ధన్

Related posts

ప్రధాని మోదీ హెచ్చరికతో.. సరిహద్దులో అదనపు బలగాలను మోహరిస్తున్న పాకిస్థాన్…

Ram Narayana

ఇక గుజరాత్ ప్రభుత్వాన్ని మేం నమ్మం.. రాజ్ కోట్ గేమింగ్ జోన్ దుర్ఘటనపై హైకోర్టు…

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా…దేశ విదేశాల్లో ప్రదర్శనలు !

Ram Narayana

Leave a Comment