Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఇది మహారాష్ట్రనా, లేక ఏపీనా!… షోలాపూర్ లో పవన్ కు బ్రహ్మరథం!

  • నవంబరు 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఎన్డీయే అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం
  • నేడు పలు ప్రాంతాల్లో సభలు, రోడ్ షోలకు హాజరు
  • షోలాపూర్ లో పవన్ కు అపూర్వ స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలిసిందే. ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థుల తరఫున సభలు, రోడ్ షోలకు పవన్ హాజరవుతున్నారు. డెగ్లూర్, నాందేడ్ వంటి ప్రాంతాల్లో పవన్ సభలకు విశేష స్పందన లభించింది. 

ముఖ్యంగా, షోలాపూర్ నగరంలో పవన్ రోడ్ షోకు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. షోలాపూర్ లో అడుగుపెట్టిన జనసేనానికి అపూర్వ స్వాగతం లభించడం చూస్తే… అది మహారాష్ట్రనా, లేక ఏపీనా అనిపించింది. 

డీజే పాటలు, బ్యాండ్ కోలాహలం నడుమ అట్టహాసంగా పవన్ రోడ్ షో సాగింది. రోడ్డు పక్కన ఇళ్లలోని వారు కూడా పవన్ పై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పవన్ అందరికీ అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Related posts

అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తా: రాహుల్ గాంధీ

Ram Narayana

I.N.D.I.A. కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదు: రాహుల్ గాంధీ

Ram Narayana

మహా వికాస్ అఘాడీకి షాక్… గుడ్ బై చెప్పిన సమాజ్ వాదీ పార్టీ

Ram Narayana

Leave a Comment