Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

ఈ వెబ్​ సైట్లను ఎంత మంది చూస్తారో తెలుసా?

  • గూగుల్ నుంచి వాట్సాప్ దాకా ఎన్నో వెబ్ సైట్లు
  • అన్నింటికీ భారీగా వినియోగదారులు
  • తరచూ సందర్శించేవారితో వందల కోట్ల వ్యూస్

ఇప్పుడంతా ఇంటర్నెట్ మయం. ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, కాసేపు సరదాగా ఎంజాయ్ చేయాలన్నా… అన్నింటికీ వేల కొద్దీ వెబ్ సైట్లు ఉన్నాయి. మరి వాటిలో ఎక్కువ మంది తరచూ చూసే వెబ్ సైట్ల వివరాలేమిటో తెలుసా? వాటిని సగటున నెలకు ఎంత మంది సందర్శిస్తారో చూద్దామా…

గూగుల్
ప్రపంచంలో అత్యధిక మంది చూసే వెబ్ సైట్లలో టాప్ గూగుల్ సైటే. దీనికి కారణం ఇది అద్భుతమైన సెర్చింజన్ కావడం, మనకు కావాల్సిన సైట్లను, డేటా క్షణాల్లోనే వెతికిపెట్టడమే.

  • ఈ వెబ్ సైట్ కు సగటున నెలకు 8,310 కోట్ల వ్యూస్ వస్తుంటాయి.

యూట్యూబ్
రెండో స్థానంలో ఉన్నది యూట్యూబ్. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా… ఆటపాటలు, సినిమాల నుంచి రాజకీయాల దాకా… అన్ని వీడియోలకూ యూట్యూబ్ అడ్డా. ఇప్పుడు న్యూస్ చానళ్లు కూడా యూట్యూబ్ లోనే లైవ్ పెట్టేస్తున్నాయి.

  • ఈ వెబ్ సైట్ కు సగటున నెలకు వచ్చే వ్యూస్… 2,960 కోట్లు

ఫేస్ బుక్  
మనుషులు ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేసేందుకు మొదలైనదే ఫేస్ బుక్. కొత్తగా స్నేహితులను సంపాదించుకోవడం, మనమేమిటో, ఏం చేస్తున్నామో చెప్పుకోవడం కోసం, ఇతరుల గురించి తెలుసుకోవడం అంతా ఈ వేదికపైనే కొనసాగుతుంది.

  • ఈ వెబ్ సైట్ కు నెలకు సగటున 1,270 కోట్ల వ్యూస్ వస్తుంటాయి.

 ఇన్ స్టాగ్రామ్
లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చానన్న డైలాగ్ ను మరిపించేలా ఇన్ స్టాగ్రామ్ దూసుకెళుతోంది. సెలబ్రిటీల నుంచి ఇప్పటితరం యువత దాకా అంతా ఇన్ స్టాగ్రామ్ వేదికగా సందడి చేస్తున్నారు.

  • దీనికి నెలకు సగటున వచ్చే వ్యూస్ 590 కోట్లు

ఎక్స్ (ట్విట్టర్)   
చిన్న చిన్న పదాలతోనే భావాన్ని వ్యక్తం చేసే సోషల్ మీడియా యాప్ గా ప్రారంభమైన ట్విట్టర్… తర్వాతి కాలంల ‘ఎక్స్’గా పేరు మార్చుకుంది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల దాకా తమ అభిప్రాయాలను, భావాలను పంచుకునే వేదికగా మారింది.

  • ‘ఎక్స్’కు సగటున నెలకు వచ్చే వ్యూస్… 470 కోట్లు

 వాట్సాప్
ఎస్ఎంఎస్ ల స్థానంలో ఒకరికొకరు సందేశాలు పంపుకొనేందుకు మొదలైన వాట్సాప్.. ఇప్పుడు చాలా రూపు మార్చుకుంది. సందేశాలే కాదు… ఆడియో, వీడియో, ఫొటోలు అన్నింటినీ వ్యక్తుల మధ్య పంచుకోవడానికి అత్యంత సులువైన మాధ్యమంగా మారింది. 

  • దీనికి నెలకు సగటున వచ్చే వ్యూస్… 450 కోట్లు

వాటికి వ్యూస్ ఏంటి?
యూట్యూబ్, ఫేస్ బుక్ అంటే సరే… వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లకు మొత్తం వ్యూస్ లెక్క ఎలా అనే సందేహం వస్తోందా? ఏ యాప్ అయినా, వెబ్ సైట్ అయినా మనం ఓపెన్ చేసినప్పుడు… మొదట నేరుగా దాని సర్వర్ కు కనెక్ట్ అవుతుంది. దాని ద్వారానే డేటా అంతా ట్రాన్స్ ఫర్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన ప్రతిసారి ఒకసారి సందర్శించినట్టే అన్నమాట.

Related posts

లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది!

Ram Narayana

టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు..

Ram Narayana

93వ ఏట పెళ్లి చేసుకొని ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్న పండు ముసలి.. తిరస్కరించిన కోర్టు

Ram Narayana

Leave a Comment