Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వద్దకు లగచర్ల భాదితులు …

ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వద్దకు లగచర్ల భాదితులు …
బాధితులతో కలిసి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఎంపీలు వద్దిరాజు,సురేష్ రెడ్డి,దామోదర్ రావు ,మాజీ ఎంపీలు ,

లగచర్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది …బీఆర్ యస్ రాజ్యసభసభులు వద్దిరాజు రవిచంద్ర ,కె .ఆర్ సురేష్ రెడ్డి ,దీవకొండ దామోదర్ రావు ,లు లగచర్ల భాదితులను తీసుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ పై దాడి కేసులో తమను అక్రమంగా ఇరికించారని ఫిర్యాదు చేశారు …తమకు న్యాయం చేయాలనీ కోరారు …

సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావు తదితర ప్రముఖులు లగచర్ల ఫార్మా బాధితులతో కలిసి ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ విజయభారతితో సమావేశమయ్యారు.తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యవసాయ భూములను తమకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేకపోవడంతో రేవంత్ రెడ్డి,ఆయన సోదరులు పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని,జైళ్లో నిర్భంధిస్తున్నారని, భౌతికదాడులకు దిగుతున్నారని కమిషన్ ఛైర్ పర్సన్ విజయభారతికి బాధిత మహిళా రైతులు వివరించారు.తమపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టాలని,అక్రమ కేసులను ఉపసంహరింపజేయాలని,భూములతో పాటు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు,ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఛైర్ పర్సన్ విజయభారతిని కలిసిన వారిలో ఎంపీలు సురేష్ రెడ్డి,రవిచంద్ర, దామోదర్ రావులతో పాటు మాజీ ఎంపీ మాలోతు కవిత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ,మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ కుమార్, హరిప్రియ హరిసింగ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్ నాయక్,రూప్ సింగ్ తదితరులు ఉన్నారు.

Related posts

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు

Ram Narayana

మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గుడ్ డెసిషన్ ….

Ram Narayana

ప్రైవేటు స్కూల్స్ వచ్చాక గురుకులాల ప్రభ కొంత తగ్గింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment