Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి!

  • జగన్ ను చూసి చాలా రోజులు అయిందన్న కోటంరెడ్డి
  • మాట్లాడేందుకు ప్రతిరోజు గంట సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తారని వ్యాఖ్య
  • ఆయన ఏం మాట్లాడినా ఎవరూ అడ్డు రాకూడదన్న కోటంరెడ్డి

వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చూసి చాలా రోజులు అవుతోందని… ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉందని… అసెంబ్లీలో ప్రతిరోజు గంటసేపు మాట్లాడేందుకు సమయం ఇస్తేనే జగన్ వస్తారని, లేకపోతే రారని అన్నారు. ఆయన ఏం మాట్లాడినా ఎవరూ అడ్డు రాకూడదని… అదే ఆయన ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

2017లో ఆయన పాదయాత్రకు వెళ్తున్న సమయంలో పార్టీ బాధ్యతలను బుగ్గనకు కానీ, మరెవరికైనా కానీ ఇచ్చి వెళ్లాల్సిందని… కానీ ఆయన అలా చేయలేదని… ఎందుకంటే ఆయన మినహా మరెవరూ మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదని కోటంరెడ్డి అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ సమస్యల కోసం పోరాడలేదని విమర్శించారు. అసెంబ్లీలో మైక్ కోసం పోరాడాలని మాకు చెప్పేవారని అన్నారు. గతంలో కోటంరెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే.

Related posts

బాబా భక్తులకు గుడ్ న్యూస్.. షిర్డీ బంద్ పై వెనక్కి తగ్గిన స్థానికులు

Drukpadam

చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో కేసులో పీటీ వారెంట్

Ram Narayana

30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్‌ను వదిలేశాడు.. ఇప్పుడు మళ్లీ చదువుతాడట!

Drukpadam

Leave a Comment