Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇద్దరికంటే ఎక్కువమంది పిల్ల‌లున్నా ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అర్హత‌!

  • పట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిబంధ‌న‌లు మారుస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం
  • జ‌నాభా వృద్ది రేటు పెంపుద‌ల‌లో భాగంగానే చట్టంలో మార్పులు

ఇక‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్నా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి గ‌తంలో ఉన్న చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నాలుగు రోజుల క్రితం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. తాజాగా సోమ‌వారం బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే  ఆమోదం పొందింది.

1960 దశకంలో జ‌నాభా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కుటుంబ నియంత్ర‌ణ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాయి. కుటుంబ నియంత్ర‌ణ‌లో భాగంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లడంలో భాగంగా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్న వారిని అన‌ర్హులుగా చేస్తూ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేశారు. 1955 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల చ‌ట్టంలోని సెక్ష‌న్ 21 బి, అలాగే 1965 మున్సిపాల్టీల చ‌ట్టం లోని సెక్ష‌న్ 13 బి ల‌ను చొప్పిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాస‌నాల స‌వ‌ర‌ణ బిల్లు 1994ను తీసుకొచ్చారు. 1994లో జ‌రిగిన ఈ స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం ఇద్ద‌రికంటే ఎక్కువ మంది సంతానం క‌లిగి ఉన్న వారు ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు. అప్ప‌టి నుంచి ఇదే విధానం కొన‌సాగుతూ వస్తోంది. 

అయితే గ‌త మూడు ద‌శాబ్దాల‌లో జ‌నాభా నియంత్ర‌ణ కొర‌కు తీసుకున్న చ‌ర్య‌లతో సంతానోత్ప‌త్తి సామ‌ర్ధ్యం రేటు బాగా త‌గ్గిపోయింది. 2001లో 2.6 నుంచి 1.5కు త‌గ్గిపోయింది. జ‌న‌న‌, మ‌ర‌ణాల నిష్ఫ‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాగా వెనుక‌బ‌డిపోయింది. త‌ద్వారా జ‌నాభా వృద్ది రేటు బాగా త‌గ్గిపోయింది. ఇదే స‌మ‌యంలో వృద్దుల జ‌నాభా రేటు ఎక్కువ‌గా ఉంది. మారుతున్న సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల దృష్ట్యా జ‌నాభాను పెంపొందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న ఉద్దేశంతోనే చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయాల్సి వ‌చ్చిందని మంత్రి నారాయణ వివరించారు. 

దీని ప్ర‌కారం గ‌తంలో ఆయా చ‌ట్టాల్లో చేసిన స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన సెక్ష‌న్ల‌ను తొల‌గిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాసనాల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు అసెంబ్లీ ఆమోద‌ముద్ర వేసింది.

Related posts

2.37 లక్షల బైకులను వెనక్కి పిలిపిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్… కారణం ఇదే!

Drukpadam

సోనియా గాంధీ ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం!

Drukpadam

రూ.500 నోటునూ వెనక్కి తీసుకుంటారా? అన్న ప్రశ్నకు గవర్నర్ దాస్ రియాక్షన్ ఇదిగో!

Drukpadam

Leave a Comment