Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి… ఏపీలోని ముంచింగిపుట్టులో 9 డిగ్రీలు!


ఏపీ, తెలంగాణలలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉన్నట్టుండి చలి పెరిగింది. హైదరాబాద్ తో పాటు సిటీ శివార్లలో టెంపరేచర్ 12 డిగ్రీలకు పడిపోయింది. దీంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. చలికి వారు బయటకు అడుగుపెట్టలేకపోతున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ముంచింగిపుట్టులో ఈ సీజన్ లోనే తొలిసారిగా సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదైంది.

సోమవారం రాత్రి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీని చలి వణికిస్తోంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో వంజంగి గుట్టలకు పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. సూర్యోదయం సమయంలో అక్కడి పకృతి సోయగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళుతున్నారు.

Related posts

అమెరికాలో మృతిచెందిన ఖమ్మం విద్యార్ధి, అతని స్నేహితుడు

Ram Narayana

సబితమ్మ నోట చంద్రబాబు మాట …ఆయన్ను నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు…

Ram Narayana

తెలంగాణ రాజకీయాలు… చంద్రబాబుపై ఈటల రాజేందర్ తీవ్రవ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment