Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..!

  • తాడేపల్లిలోని కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరు
  • పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై జగన్ మార్గనిర్దేశం

వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. 

త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. 

పోలవరం ఎత్తు తగ్గింపుపై పార్లమెంటులో నిలదీయాలని జగన్ తమకు సూచించారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని పార్లమెంటులో పోరాడతామని చెప్పారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల?

Ram Narayana

తన భార్య తనపై పోటీ చేస్తుండటంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ స్పందన…

Ram Narayana

తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Ram Narayana

Leave a Comment