Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్!

  • మాజీ డిఫెన్స్ మినిస్టర్, హమాస్ నాయకుడికీ అరెస్ట్ వారెంట్
  • యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలపై నోటీసులు
  • అసంబద్ధ అరెస్ట్ వారెంట్ అంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం

ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నెతన్యాహూతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్‌పై, అలాగే హమాస్ నాయకుడు ఇబ్రహీం ఆల్ మస్రీకి ఈ వారెంట్ జారీ చేసింది.

గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రధానికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ఇజ్రాయెల్ స్పందించింది. విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ స్పందిస్తూ… అసంబద్ధ అరెస్ట్ వారెంట్లను ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం చట్టబద్ధతను కోల్పోతోందని విమర్శించారు.

Related posts

టర్కీలో రష్యా దౌత్యవేత్త మృతి.. పుతిన్‌పై సందేహాలు

Ram Narayana

చైనాలో గడ్డకట్టిన సరస్సుపై ఐక్యరాజ్యసమితి అధికారి యోగా!

Ram Narayana

రణరంగంలా తైవాన్ పార్లమెంట్.. చితక్కొట్టేసుకున్న ఎంపీలు.. !

Ram Narayana

Leave a Comment