Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా కేసు ఎఫెక్ట్… ‘అదానీ’కి షాకిచ్చిన కెన్యా ప్రభుత్వం…

  • ఎయిర్‌పోర్ట్, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేసిన కెన్యా
  • ఈ మేరకు ప్రకటన చేసిన కెన్యా అధ్యక్షుడు విలియం రూటో
  • తొలుత ముప్పై ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్న కెన్యా

గౌతమ్ అదానీకి కెన్యా షాకిచ్చింది. గౌతమ్ అదానీకి ఇవ్వదలిచిన ఎయిర్‌పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.

విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం కింద ముప్పై ఏళ్లకు కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్లకు అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అమెరికాలో కేసు ఘటన నేపథ్యంలో ఈ ఒప్పందంపై కెన్యా ప్రభుత్వం వెనక్కి వెళ్లింది.

కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం అదానీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా, పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.

Related posts

ఇంకా విడుదల కానీ యూఎస్ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు.. విద్యార్థుల్లో టెన్షన్

Ram Narayana

100 గ్రాముల అధిక బరువు… వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు…

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషుల ఆర్చరీ టీమ్..

Ram Narayana

Leave a Comment