Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్ మెగా వేలం.. ఏ జ‌ట్టులో ఎవ‌రెవ‌రున్నారంటే..!

  • సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం
  • రూ. 639.15 కోట్లు ఖ‌ర్చు చేసి, 182 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు
  • అత్య‌ధికంగా పంజాబ్ 23 మంది ఆట‌గాళ్ల‌ కొనుగోలు 
  • అత్య‌ల్పంగా 14 మందిని వేలంలో కొన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం ముగియ‌డంతో ప‌ది జ‌ట్ల‌లోని ఆట‌గాళ్ల జాబితాపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇక ఈ మెగా వేలంలో ప‌ది ఫ్రాంచైజీలు రూ. 639.15 కోట్లు ఖ‌ర్చు చేసి, 182 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది ఓవ‌ర్సీస్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

అలాగే మొత్తం 8 మంది ప్లేయ‌ర్ల‌ను ఆర్‌టీఎం ద్వారా ఆయా జ‌ట్లు ద‌క్కించుకున్నాయి. అత్య‌ధికంగా పంజాబ్ 23 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌గా, అత్య‌ల్పంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 14 మందిని వేలంలో ద‌క్కించుకుంది. ఐపీఎల్ మెగా వేలం, రిటెన్ష‌న్ల‌తో క‌లిపి ఏ జ‌ట్టులో ఎవ‌రెవ‌రున్నారు, 10 ఫ్రాంచైజీల పూర్తి స్క్వాడ్స్ పై ఓ లుక్కేద్దాం. 

ముంబ‌యి ఇండియ‌న్స్ సేన ఇదే..
మెగా వేలం, రిటెన్ష‌న్ల‌తో క‌లిపి ముంబ‌యి ఇండియ‌న్స్ మొత్తం 23 మంది ఆట‌గాళ్ల‌ను తీసుకుంది. వీరిలో 8 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. 

బ్యాటర్లు: సూర్యకుమార్ యాదవ్ (రిటైన్), రోహిత్ శర్మ (రిటైన్), తిలక్ వర్మ (రిటైన్), బెవాన్-జాన్ జాకబ్స్
వికెట్ కీపర్లు: రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్, కృష్ణన్ శ్రీజిత్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా (పేస్; రిటైన్), నమన్ ధీర్ (స్పిన్; ఆర్‌టీఎం), విల్ జాక్స్ (స్పిన్), రాజ్ అంగద్ బవా (పేస్), విఘ్నేశ్‌ పుత్తూర్ (స్పిన్)
స్పిన్నర్లు: అల్లా గజన్‌ఫర్, కర్ణ్ శర్మ, మిచెల్ సాంట్నర్
ఫాస్ట్ బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (రిటైన్), దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, రీస్ టాప్లీ, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, లిజాద్ విలియమ్స్ 

చెన్నై కంప్లీట్ టీమ్ ఇదే.. 
రిటెన్ష‌న్లు, మెగా వేలంలో క‌లిపి 25 మంది ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసింది. ఇందులో ఏడుగురు ఓవ‌ర్సీస్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (రిటైన్), రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, దీపక్ హుడా, ఆండ్రీ సిద్దార్థ్
వికెట్ కీపర్లు: డెవాన్ కాన్వే, ఎంఎస్ ధోనీ (రిటైన్), వంశ్ బేడీ
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా (స్పిన్; రిటైన్), శివమ్ దూబే (పేస్; రిటైన్), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ (స్పిన్), సామ్ కర్రాన్ (పేస్), రచిన్ రవీంద్ర (స్పిన్; ఆర్‌టీఎం), విజయ్ శంకర్ (పేస్), అన్షుల్ కాంబోజ్ (పేస్), జామీ ఓవర్టన్ (పేస్), కమలేష్ నాగర్కోటి (పేస్), రామకృష్ణ ఘోష్ (పేస్)
స్పిన్నర్లు: నూర్ అహ్మద్, శ్రేయాస్ గోపాల్
ఫాస్ట్ బౌలర్లు: మతీషా పతిరణ‌ (రిటైన్), ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్ 

ఆర్‌సీబీ పూర్తి జ‌ట్టు ఇలా..
ఐపీఎల్ మెగా వేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. రిటెన్ష‌న్ల‌తో క‌లుపుకొని మొత్తం 22 మందిని కొనుగోలు చేయ‌గా, వీరిలో 8 మంది విదేశీయులు ఉన్నారు. 

బ్యాటర్లు: విరాట్ కోహ్లీ (రిటైన్), రజత్ పటీదార్ (రిటైన్), టిమ్ డేవిడ్, మనోజ్ భాండాగే, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా
వికెట్ కీపర్లు: ఫిల్ సాల్ట్, జితేశ్‌ శర్మ
ఆల్‌రౌండర్లు: లియామ్ లివింగ్‌స్టోన్ (స్పిన్), కృనాల్ పాండ్యా (స్పిన్), స్వప్నిల్ సింగ్ (స్పిన్), రొమారియో షెపర్డ్ (పేస్), జాకబ్ బెథెల్ (స్పిన్), మోహిత్ రాథీ (స్పిన్)
స్పిన్నర్లు: సుయాశ్‌ శర్మ, అభినందన్ సింగ్
ఫాస్ట్ బౌలర్లు: హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ (రిటైన్‌), రసిఖ్ సలామ్, నువాన్ తుషార, లుంగి ఎంగిడి

ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు ఎలా ఉందంటే..!
ఈసారి మెగా వేలంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. మొత్తం 20 మందిని తీసుకుంది. వీరిలో 7 మంది ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్లు ఉన్నారు. 

బ్యాటర్స్: ట్రావిస్ హెడ్ (రిటైన్), అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ
వికెట్ కీపర్లు: హెన్రిచ్ క్లాసెన్ (రిటైన్), ఇషాన్ కిషన్, అథర్వ తైడే
ఆల్‌రౌండర్లు: అభిషేక్ శర్మ (స్పిన్; రిటైన్), నితీష్ కుమార్ రెడ్డి (పేస్; రిటైన్), కమిందు మెండిస్ (స్పిన్)
స్పిన్నర్లు: ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, జీషన్ అన్సారీ
ఫాస్ట్ బౌలర్లు: మహ్మద్ షమీ, పాట్ కమిన్స్ (రిటైన్‌), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, ఎషాన్ మలింగ

కేకేఆర్ కంప్లీట్ స్క్వాడ్ ఇదే..
ఐపీఎల్ రిటెన్ష‌న్స్‌, మెగా వేలంలో కలిపి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 21 మందిని కొనుగోలు చేసింది. 8 మంది విదేశీ ప్లేయ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. 

బ్యాటర్లు: రింకు సింగ్ (రిటైన్), రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీశ్‌ పాండే, లువ్నిత్ సిసోడియా, అజింక్యా రహానే
వికెట్ కీపర్లు: క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్
ఆల్‌రౌండర్లు: వెంకటేశ్‌ అయ్యర్ (పేస్), ఆండ్రీ రస్సెల్ (పేస్; రిటైన్), సునీల్ నరైన్ (స్పిన్; రిటైన్), రమణదీప్ సింగ్ (పేస్; రిటైన్), అనుకుల్ రాయ్ (స్పిన్), మొయిన్ అలీ (స్పిన్)
స్పిన్నర్లు: వరుణ్ చక్రవర్తి (రిటైన్), మయాంక్ మార్కండే
పేస‌ర్లు: హర్షిత్ రాణా (రిటైన్), వైభవ్ అరోరా, అన్రిచ్ నార్ట్జే, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్

పంజాబ్ కింగ్స్ పూర్తి జ‌ట్టు ఇలా..
రిటెన్ష‌న్స్‌, మెగా వేలంలో క‌లిపి పంజాబ్ కింగ్స్ 25 మందిని కొనుగోలు చేసింది. ఏకంగా ఐదుగురు ఆసీస్ ప్లేయ‌ర్ల‌ను తీసుకుంది. మొత్తంగా 8 మంది ఓవ‌ర్సీస్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. 

బ్యాటర్లు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ (రిటైన్), నేహాల్ వధేరా, హర్నూర్ సింగ్ పన్ను, ప్రియాంశ్‌ ఆర్య, పైలా అవినాశ్‌
వికెట్ కీపర్లు: జోష్ ఇంగ్లిస్, విష్ణు వినోద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రిటైన్)
ఆల్‌రౌండర్లు: గ్లెన్ మాక్స్‌వెల్ (స్పిన్), మార్కస్ స్టోయినిస్ (పేస్), మార్కో జాన్సెన్ (పేస్), హర్‌ప్రీత్ బ్రార్ (స్పిన్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (పేస్), ఆరోన్ హార్డీ (పేస్), ముషీర్ ఖాన్ (స్పిన్), సూర్యాంశ్ షెడ్జ్ (పేస్)
స్పిన్నర్లు: యుజ్వేంద్ర చాహల్, ప్రవీణ్ దూబే
ఫాస్ట్ బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్ (ఆర్‌టీఎం), లూకీ ఫెర్గూసన్, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైషాక్, కుల్దీప్ సేన్, జేవియర్ బార్ట్‌లెట్

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్ ఇదే..
ఐపీఎల్ మెగా వేలం, రిటెన్ష‌న్లు క‌లిపి ఎల్ఎస్‌జీ 24 మందిని ద‌క్కించుకుంది. ఇందులో 6 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. 

బ్యాటర్స్: ఐడెన్ మార్క్‌ర‌మ్, డేవిడ్ మిల్లర్, ఆయుశ్ బదోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్
ఆల్‌రౌండర్లు: అద్బుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్)
స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేశ్‌ సింగ్
పేస‌ర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాశ్‌ దీప్, అవేశ్‌ ఖాన్, ఆకాశ్‌ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ‌లగం ఇదే..
రిటెన్ష‌న్లు, వేలంలో క‌లిపి ఢిల్లీ 23 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌గా, వీరిలో ఏడుగురు ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్లు ఉన్నారు. 

బ్యాటర్లు: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (ఆర్‌టీఎం), హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్ (రిటైన్), ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్
వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ (రిటైన్), డోనోవన్ ఫెర్రేరియా
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ (స్పిన్; రిటైన్), అశుతోష్ శర్మ (స్పిన్), సమీర్ రిజ్వీ (స్పిన్), దర్శన్ నల్కండే (పేస్), విప్రజ్ నిగమ్ (స్పిన్), అజయ్ మండల్ (స్పిన్), మన్వంత్ కుమార్ (పేస్), త్రిపురాణా విజయ్ (స్పిన్), మాధవ్ తివారీ (పేస్)
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్ (రిటైన్)
ఫాస్ట్ బౌలర్లు: మిచెల్ స్టార్క్, ముఖేశ్‌ కుమార్, టి. నటరాజన్, మోహిత్ శర్మ, దుష్మంత చమీరా

రాజ‌స్థాన్ సేన ఇదే..
రిటెన్ష‌న్స్‌, మెగా వేలంలో క‌లిపి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో క‌లిపి మొత్తం 20 మంది ప్లేయ‌ర్ల‌ను  కొనుగోలు చేసింది. 

బ్యాటర్స్: యశస్వి జైస్వాల్ (రిటైన్), షిమ్రోన్ హెట్మెయర్ (రిటైన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ
వికెట్ కీపర్లు: సంజు శాంసన్ (రిటైన్), ధృవ్ జురెల్ (రిటైన్), కునాల్ సింగ్ రాథోడ్
ఆల్‌రౌండర్లు: రియాన్ పరాగ్ (స్పిన్; రిటైన్), నితీష్ రాణా (స్పిన్), యుధ్వీర్ సింగ్ (పేస్)
స్పిన్నర్లు: వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ
పేస‌ర్లు: జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ (రిటైన్), తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్‌ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూకీ, క్వేనా మఫాకా, అశోక్ శర్మ

గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి జ‌ట్టు ఇదే.. 
ఐపీఎల్ మెగా వేలం, రిటెన్ష‌న్ల‌తో క‌లిపి గుజ‌రాత్ టైటాన్స్ 25 మంది ప్లేయ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. వీరిలో ఏడుగురు ఓవ‌ర్సీస్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

బ్యాటర్లు: శుభ్‌మ‌న్‌ గిల్ (రిటైన్), సాయి సుదర్శన్ (రిటైన్), రాహుల్ తెవాటియా (రిటైన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
వికెట్ కీపర్లు: జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్
ఆల్‌రౌండర్లు: రషీద్ ఖాన్ (స్పిన్; రిటైన్), వాషింగ్టన్ సుందర్ (స్పిన్), ఎం షారుక్ ఖాన్ (స్పిన్; రిటైన్), మహిపాల్ లోమ్రోర్ (స్పిన్), నిషాంత్ సింధు (స్పిన్), అర్షద్ ఖాన్ (పేస్), జయంత్ యాదవ్ (స్పిన్), గ్లెన్ ఫిలిప్స్ (స్పిన్), కరీం జనత్ (పేస్)
స్పిన్నర్లు: మానవ్ సుతార్, సాయి కిషోర్
ఫాస్ట్ బౌలర్లు: కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీ, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కుల్వంత్ ఖేజ్రోలియా

Related posts

ఐపీఎల్‌ వేలంలో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ వయసుపై ఆరోపణలు!

Ram Narayana

ఐపీఎల్ రిటెన్షన్… అన్ని జట్ల రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా ఇదే!

Ram Narayana

ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్ల రిటెన్ష‌న్‌ రూ. 20 కోట్లు ప‌లికే అవ‌కాశం!

Ram Narayana

Leave a Comment