Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు.. స్నాతకోత్సవానికి హాజరైన 11 వేల మంది విద్యార్థులు…

చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు.. స్నాతకోత్సవానికి హాజరైన 11 వేల మంది విద్యార్థులు
-వుహాన్‌లోని యూనివర్సిటీలో స్నాతకోత్సవం
-విద్యార్థుల్లో కనిపించని మాస్కులు, భౌతిక దూరం
-ఆశ్చర్యపరుస్తున్న ప్రపంచ దేశాలు

కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో తిరిగి సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వుహాన్‌లోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో 11 వేల మంది విద్యార్థులు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా కరోనా గుప్పిట్లోనే ఉన్నాయి. మాస్కులు లేకుండా బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. పలు దేశాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో వుహాన్‌ యూనివర్సిటీ 11 వేల మంది విద్యార్థులతో, అదీ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్నాతకోత్సవం నిర్వహించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. గతేడాది డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులను, తాజాగా డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులను కలిపి వుహాన్ యూనివర్సిటీ ఈ స్నాతకోత్సవం నిర్వహించింది.

కరోనా కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ లో మాస్క్ లు ధరించకుండా జరిగిన స్నాతకోత్సవం లో విద్యార్థలు పెద్ద ఎత్తున పాల్గొండపై ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఇది నిజామా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అసలు చైనా లో ఏమి జరుగుతుంది . అనే దానిపై ద్రుష్టి సారించారు.

Related posts

కరోనా స్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చురకలు…

Drukpadam

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల గరిష్ఠ ధరను నిర్ణయించిన కేంద్రం…

Drukpadam

ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌లో స‌డ‌లింపులు .. భారీగా రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌నాలు..

Drukpadam

Leave a Comment