క్రైమ్ వార్తలు

ఇది అధర్మ కాంటా…రైతులకు టోకరా!

పత్తి కొనుగోళ్లలో దళారులు చేస్తున్న మాయ ఇది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇటీవల కొందరు రైతులు ఈ మోసాన్ని గుర్తించారు. చిన్న రైతులు రవాణా వ్యయప్రయాసలు భరిం చలేక పత్తిని గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు.

మార్కెట్ కంటే క్వింటాపై రూ.100- 200 ఎక్కువ చెల్లిస్తామంటూ దళారులు చెబుతుండడం మరో కారణం.

రైతుల ఇళ్లు, పొలాల వద్దకే దళారులు వాహనంలో యంత్రాలను తీసుకెళ్లి పంటను తూకం వేస్తారు. ఆ యంత్రంలో ఒక చిప్ను అమరుస్తున్నారు.

50-100 మీటర్ల దూరం నుంచి రిమోట్ తో ఈ చిప్ను నియంత్రించవచ్చు.

రిమోట్ లోని బటన్ ను ఒకసారి నొక్కితే.. 5 కిలోలు, రెండుసార్లు నొక్కితే 10 కిలోలు తగ్గేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరికొందరు యంత్రాల్లో ముందుగానే 5 నుంచి 10 కిలోలు తగ్గేలా సర్దుబాటు చేసుకొని మోసగిస్తున్నారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పత్తి రైతు కుమారస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ’40-45 కిలోలు తూగాల్సిన పత్తి బస్తాను కాంటా పై పెడితే, 35 కిలోలే చూపించడంతో అను మానం వచ్చింది.

అదే యంత్రంపై 90 కిలోల బరువున్న వ్యక్తిని నిలబెట్టగా.. 68 కిలోలే చూపింది. ఓ వ్యక్తి దూరంగా నిలబడి, జేబులో ఉన్న రిమోట్తో బరువును నియంత్రిస్తున్నట్లు గమనించి.. వారిని పోలీసులకు అప్పగించాం’ అని ఆయన తెలిపారు.

Related posts

పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్!

Drukpadam

సూర్యాపేటలో దారుణం.. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం!

Drukpadam

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. డ్రగ్స్‌, ఆయుధాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు…

Ram Narayana