తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ పథకం దాతలకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. అప్పట్లో అనంత స్వర్ణమయం దాతలకు అర్చన అనంతరం దర్శనం కల్పించేవారని.. ఇప్పుడు మార్పులు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు వెల్లడించింది. దాతలకు ఏడాదికి మూడు రోజులు బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, అనివార్య కారణాల వల్ల 2008లో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ పథకాన్ని రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
previous post
next post