Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

లక్ష డాలర్లకు చేరిన బిట్ కాయిన్ వాల్యూ!

  • ట్రంప్ గెలవడంతో బిట్ కాయిన్ దూకుడు
  • 4 వారాల్లోనే 45 శాతం పెరిగిన విలువ
  • భవిష్యత్తులో 1.20 లక్షల డాలర్ల మార్క్ చేరుతుందని అంచనాలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ వాల్యూ లక్ష డాలర్లకు చేరింది. గడిచిన నాలుగు వారాల్లోనే ఏకంగా దీని వాల్యూ 45 శాతం పెరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే 1.20 లక్షల మార్కును కూడా చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టోకరెన్సీకి ట్రంప్ అనుకూలంగా వ్యవహరించడమే బిట్ కాయిన్ దూకుడుకు కారణమని చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే బిట్ కాయిన్ వాల్యూ రికార్డు స్థాయికి చేరింది. 

ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో బిట్ కాయిన్ ధర 69,374 డాలర్లుగా ఉంది. అంతకు రెండేళ్ల ముందు 17 వేల డాలర్లకు పడిపోయింది. అయితే, ట్రంప్ గెలవడం, ఎలాన్ మస్క్ కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగింది. దీంతో పాటు గతంలో ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించిన పాల్ అట్కిన్ కు ట్రంప్ మరోసారి అవే బాధ్యతలు అప్పగించడం సానుకూల ప్రభావం చూపింది. కొత్త ప్రభుత్వంలో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో  బిట్ కాయిన్ ధర రోజురోజుకూ పెరిగిపోతోందని మడ్ రెక్స్ సీఈవో పేర్కొన్నారు. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ 1,20,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

Related posts

మోటో ఎడ్జ్ 50 ప్రో ధరపై భారీ తగ్గింపు ఆఫర్…

Ram Narayana

పెళ్లిళ్ల సీజనా మజాకా?… భారీగా పెరిగిన బంగారం దిగుమతులు!

Ram Narayana

అనిల్ అంబానీ కంపెనీ షేర్లకు రెక్కలు.. రూ. లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు!

Ram Narayana

Leave a Comment