- తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన పొన్నం
- ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్
- ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. తన ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకి కూడా మంత్రి ఆహ్వానం అందించనున్నారు.
సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే చెప్పారు.
కేసీఆర్‌తో తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై చర్చ జరగలేదు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం తరఫున ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణకు వస్తారా? లేదా? అనేది ఇక ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అది ఆయనే నిర్ణయించుకుంటారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ నెల 9న జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పొన్నం ప్రభాకర్ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రిని ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందించిన అనంతరం పొన్నం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.
కేసీఆర్‌ను కలిసిన సమయంలో ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు. అంతకుముందు, రాజ్ భవన్‌లో గవర్నర్‌ను, దిల్‌కుషా అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాలను అందించారు.