Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో మండలి రద్దుపై జగన్ పునరాలోచన -వైసీపీ బలం పెరగటమే కారణమా ?

పీలో మండలి రద్దుపై జగన్ పునరాలోచన -వైసీపీ బలం పెరగటమే కారణమా ?
-రేపటితో ముగియనున్న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం…
-మండలిలో పెరగనున్న వైసీపీ బలం
-చైర్మన్ ,వైస్ -వైస్ చైర్మన్లుగా ఇక్బల్ , జంగాలకు అవకాశం
-మండలిలో ఇక వైసీపీ హవా
-15కి పడిపోనున్న టీడీపీ సభ్యుల సంఖ్య
-20కి పెరగనున్న వైసీపీ బలం
-రేపటితో ఉమ్మారెడ్డి కూడా రిటైర్

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి విరమించుకున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. … బలం పెరగటమే కారణమా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది. నిన్నమొన్నటి వరకు వైసీపీ కు మండలిలో బలం లేదు …. ముఖ్యమైన ఏ బిల్లు పాస్ కావాలన్నా టీడీపీ సంఖ్య బలంతో వైసీపీ కి ఇబ్బందులు వచ్చేవి. … ప్రత్యేకించి జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానులు బిల్లోపై మండలిలో ముష్టి యుద్ధమే జరిగింది. .. రాష్ట్రంలో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీ తో విజయఢంకా మోగించిన వైసీపీ కి మండలిలో ఇప్పటివరకు బలం లేకపోవడంతో ఇబ్బందిగా మారింది . కాని ఇప్పుడు గవర్నర్ కోటాలో 4 సీట్లు వైపు ఖాతాలోకి వచ్చి చేరడంతో బలం పెరిగింది. ఇక రెండు సభల్లో వైసీపీ కి ఆధిక్యం ఉండటంతో వైసీపీ కి కలిసొచ్చిన అంశంగా మారింది. అందువల్ల రద్దు చేద్దామనుకున్న మండలిని కొనసాగించటం ద్వారా ఎమ్మెల్సీ సీట్లను కొంతమంది ఇవ్వవచ్చు అనేది ఇప్పడు జగన్ ఆలోచనగా మారిందని పరిశీలకుల అభిప్రాయం. తాను అనుకున్నవాళ్లకు ,సామాజిక సమీకరణాలు , ఆయా నియోజవర్గాలలో నాయకుల మధ్య సర్దుబాట్లు చేసేందుకు మండలి ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందువల్ల జగన్ మండలి కొనసాగింపుకే మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మండలిలో చైర్మన్ ,వైస్ చైర్మన్ ల ఎంపిలకపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మండలి చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బల్ ను వైస్ చైర్మన్ గా జాంగా కృష్ణమూర్తిని ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. టీడీపీ హయాంలో మండలి చైర్మన్ గా షరీఫ్ , ఉన్నారు .అందువల్ల వైసీపీ కూడా ముస్లిం వైపే ముగ్గుచూపుతుంది.

శాసనమండలిలో శుక్రవారం నుంచి వైసీపీ బలం పెరగనుంది. రేపటితో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడమే అందుకు కారణం. ఈ పరిణామంతో మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గుతుంది. అదే సమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేయడం తెలిసిందే. ఇక, వైసీపీ సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది.

తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.

Related posts

విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …

Ram Narayana

చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదు.. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నా: జగన్

Drukpadam

కేటీఆర్… ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment