Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పద్దతి మార్చుకుంటేనే మనుగడ – రేవంత్ డ్డికి మేధావుల సూచన…

పద్దతి మార్చుకుంటేనే మనుగడ కొనసాగుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ కు పలువురు మేధావులు సూచించారు . ప్రజల ఆకాంక్షలు ఏడాది ప్రభుత్వ పాలనా పై తెలంగాణ రాష్ర వర్కింగ్ జర్నలిస్టులు సంఘం (టీ యూడబ్ల్యూ జే) మంగళవారం హైదరాబాద్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నపలువురు మేధావులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిందని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాటి అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూనే అమలుగాని వాగ్దానాలు ఏ ప్రభుత్వం చేసిన మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత బస్, ఉచిత గ్యాస్, రైతులకు 21 వేల కోట్ల రుణ మాఫీ లాంటివి అమలు చేసినప్పటికీ , రైతు భరోసా, గృహ లక్ష్మి లాంటి పధకాలు అమలు చేయకపోవడం పై ఆయా వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. ఏడాదిగా మంత్రి వర్గ విస్తరణ లేకపోవడం శోచనీయమన్నారు. హైడ్రా మూసి ప్రక్షాళన లాంటి కార్యక్రమాలు మంచిదే అయినా ప్రజలను బయపెట్టేవిగా ఉండకూడదని సూచించారు. గృహ యజమానులు ఒప్పించి,మెప్పించి వారిని గౌరవప్రదంగా తరలించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఏడాది పూర్తీ అయినా మరో మూడు సంవత్సరాలు మంచి పాలనా అందించే అవకాశం ఉందని చేసిన వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ప్రజాల మనస్సులు గెలుచుకోవాలన్నారు . ప్రతిపక్షంలో ఉన్నట్లుగా సీఎం మాట్లాడకూడదని భాష మార్చుకుంటే ప్రజల హృదయాలను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి తనకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రానికి ఆయనకి మంచి జరుగుతుందని హితవు పలికారు.

విశ్వనగరంపై పెద్ద వేటు పడబోతోంది పద్మజ షా

విశ్వానగరం ….విశ్వనగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ పై మత కల్లోలాల కత్తి వేలాడుతున్నదని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం మాజీ అధిపతి పద్మజ షా అన్నారు . ఇటీవల కాలంలో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వక్తం చేసారు. వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగించాలన్నారు. ఏడాది కాలంలో మహిళలలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అని చెప్పారు. అదే సందరంలో లగచర్ల, జైనూర్ లాంటి చోట్ల ప్రజలగొంతునొక్కే ప్రయత్నాలు ప్రజాసౌమ్యానికి విఘాతం కలిగిస్తాయనున్నారు. ప్రజలు ఇబ్బందులను ఓపిగ్గా వింటున్న ప్రభుత్వం వాటిని అర్ధం చేసుకొని అడ్రస్ చేస్తే మంచి పేరు దక్కుతుందన్నారు .

రైతుల రుణ మాఫీ…. యాభైవేల ఉద్యోగాల కల్పన మంచిదే…… శ్రీనివాస్ రెడ్డి ..

రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతులకు 21 వేల కోట్ల రుణ మాఫీ, 50 వేల ఉద్యోగాలు ఇవ్వట గొప్పవిషయమన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం లేదని , రిటైర్ అయినా వారికీ రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడంలేదనే అభిప్రాయం ఉన్నదన్నారు. ప్రభుత్వం మరీనా విధానాలు మారలేదని పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ జరగలేదని దింతో పాలనా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలాగా తయారైందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం అతిపక్షం గా మారిపోయిందని విమర్శించారు.

పేర్లు మార్చటం తప్ప వొరిందియేమిటని ప్రజలనంటున్నారు ముస్తాక్ మాలిక్

ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారని, హైడ్రా పేరుతొ హడలెత్తిస్తున్నారని మూసీ పేరుతొ బయపెడుతున్నారని టీ ఎస్ ను టీ జి చేయడం తప్ప ప్రజకు వొరిగిందేమిటని ప్రశ్నించారు. మైనారిటీ సంక్షేమానికి వేలకోట్ల రూపాయలు ఇచ్చినట్టు ప్రకటించిన అందులో ప్రభుత్వం ఎన్నికోట్లు విడుదల చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్న ముస్లింలు సైతం సానుకూలంగా లేరని తెలిపారు.

అధికార పక్షం కూడా ప్రతిపక్షంలాగా మాట్లాడడం సరి కాదు…. పి.వినయ్ కుమార్,

అధికార పక్షం కూడా ప్రతిపక్షంలాగా మాట్లాడడం సరి కాదుని ప్రముఖ సామజిక విశ్లేషకులు పి.వినయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గతంలోకంటే మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటం శుభపరిణామం అన్నారు… ప్రజల సమస్యలు వినేందుకు ఆసక్తి చూపడం జరుగుతున్నా ఫలితాలు రావడం లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో పుస్తకం ఉంటె బాగుండేదని పేర్కొన్నారు.
ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చి నిర్మించిన గృహాలను కూలగొట్టడం ఏమిటన్నారు. కెసిఆర్ ఓటమిని కోరుకొని కొత్తప్రభుత్వాన్ని తెచ్చారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోలేదని అన్నారు . ఇది బాథ్యతగా వ్యహహరించకపొతే ప్రజలకు ఏమి చేయాలో తెలుసన్నారు ..

ప్రభుత్వానికి ఒక్క రోజు చాలు… సజయ

ప్రజలకు మేలు చేయాలనే చిత్త శుద్ధి ఉంటె ప్రభుత్వానికి ఒక సంవత్సరం అవసరం లేదు వన్ డే చాలని సామజిక విశ్లేషకురాలు సజయ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఉచిత బస్ సర్వీసుల్లో మహిళలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని వాపోయారు. ఉచిత బస్సు లో పెట్టి అనేక సర్వీసులను రద్దు చేశారని దింతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హాస్టల్స్ లో ఆడపిల్లపై ఘోరాలు జరుగుతున్నాయని, భువనగిరి లో ఇద్దరమ్మాయిలు మరణించిన విషయాన్నీ గుర్తుచేశారు. ఇంకా ఈ సమావేశం లో డాక్టర్ వి వి రావు, ఆర్ ఎస్ వి. బద్రీనాథ్, మాస్టర్జీ, మజార్ హుస్సేన్, బండారు రామ్ మోహన్ రావు, తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి టీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షలు కే.విరహత్ అలీ, సమన్వయకర్తగా వ్యవహరించగా, సమావేశావుద్దేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ వివరించి వక్తలను పరిచయం చేసారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. యాదగిరి వందన సమర్పణ చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాదికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, huj అధ్యక్షలు శంకర్ గౌడ్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం..డిప్యూటీ సీఎం భట్టి!

Ram Narayana

పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా సేవ చేస్తా: పాలేరులో షర్మిల…

Drukpadam

డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …

Ram Narayana

Leave a Comment