అమెరికాలో వలసలదారులపై డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ..
ఇతర దేశాలకు చెందిన అమెరికాలో ఉన్న వలసదారులను వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని ఆ దేశాలకు తెలిపారు.
లేకుంటే ఆ దేశాలలో వ్యాపార సంబంధాలు కట్ చేసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ ప్రధాన అస్త్రం
వలసదారులను వెంటనే దేశం విడిచి వెళ్లి పోవాలని కోరుతున్నారు. ఆయా దేశాలు కూడా అమెరికాలో ఉన్న వలసదారులను వెనక్కి పిలిపించాలి.. లేకుంటే ఆ దేశాలతో బిజినెస్ రిలేషన్ షిప్ కట్ చేసుకుంటామని ట్రంప్ అన్నారు.
వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు తాను వ్యాపారాన్ని చాలా కష్టతరం చేస్తానని వారిపై భారీగా సుంకాలు విధించబడతాయని ట్రంప్ అన్నారు.
అక్రమ వలసదారులను సైనిక బలగాలతో బహిష్కరించాలని కూడా భావిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. దేశంలో చట్టాలను అనుసరించి వలసదారుల విషయంలో ఎంత వరకు వెళ్లాలో అంతవరకు వెళతామని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ పాలసీలను తమ ప్రచారాస్త్రంగా ఉపయోగించడం ద్వారా తన నిర్ణయాన్ని అప్పటికే ప్రకటించాడు. ఒకరకంగా ట్రంప్ విజయానికి ఇమ్మిగ్రేషన్ పాలసీ కూడా ఓ కారణం.
2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. ట్రంప్ కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి చారిత్రాత్మక విజయం సాధించడంతో 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికయ్యారు.