Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఏ జిల్లానూ రద్దు చేయబోవడం లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచన లేదని వెల్లడి
  • రాష్ట్ర ప్రభుత్వమేదైనా నిధుల కోసం కేంద్రం వద్దకు వెళ్లడం సాధారణ విషయమని వెల్లడి 
  • వెళ్లిన ప్రతిసారీ నిధులు రావన్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ… ఏ జిల్లాను రద్దు చేయబోమని, అసలు పాత జిల్లాలను రద్దు చేసే ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని వెల్లడించారు.

ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళుతున్నారని, కానీ నిధులు తెచ్చారా? అని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం వద్దకు తరచూ నిధుల కోసం వెళ్లడం సాధారణ విషయమేనని, కానీ వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని గుర్తించాలన్నారు.

తెలంగాణ వచ్చాక పదేళ్లు బీఆర్ఎస్ పాలించిందని, వారి హయాంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో అందరికీ తెలుసని విమర్శించారు. తమది పేదల ప్రభుత్వమన్నారు. పేదల కోసం అనునిత్యం పని చేస్తామన్నారు.

Related posts

ఆరు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!

Ram Narayana

తెలంగాణ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ …తమకు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ యస్

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా…!

Ram Narayana

Leave a Comment