విజయమ్మ రాసిన పుస్తకంలో తప్పులు: గోనె ప్రకాశ్ రావు…
-వైఎస్ పాదయాత్రలో జగన్ ఎక్కడా లేడు
-వైఎస్ పై పుస్తకం రాసిన విజయమ్మ
-వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొన్నట్టు రాశారని వెల్లడి
-అది నిజమని నిరూపిస్తే ఉరేసుకుంటానని సవాల్
-కేసీఆర్ ,జగన్ పైన కామెంట్లు -బీజేపీ తలుచుకుంటే వారు జైలు కెళ్ళడం ఖాయమని వ్యాఖ్య
గొనె ప్రకాష్ రావు మాజీ శాసనసభ్యులు మంచి రాజకీయ విశ్లేషకులు… వైయస్ కు వీరాభిమాని … వైయస్ సతీమణి విజయమ్మ రాసిన పుస్తకంపై కామెంట్లు చేశారు. అందులో తప్పులు ఉన్నాయని వెల్లడించాడు…వైయస్ పాదయాత్రలో జగన్ పాల్గొన్నట్లు విజయమ్మ రాయడాన్ని తప్పుపట్టారు. వైయస్ పాదయాత్రలో జగన్ ఉన్నట్లు నిరూపిస్తే తాను ఉరి వేసుకోవడానికైనా సిద్ధమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైయస్ పాదయాత్రలో భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, సుధీర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ మొదటి నుంచి చివరిదాకా ఉన్నారని పేర్కొన్నారు.
గోనె ప్రకాశ్ రావు చేసిన తీవ్రవ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయ్యాయి . వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగి విజయమ్మ రాసిన పుస్తకంలో తప్పులు ఉన్నాయని అన్నారు. వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా ఉన్నారని విజయమ్మ పేర్కొన్నారని, అది అబద్ధం అని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు.
నాడు వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, సుధీర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ ఉన్నారని వెల్లడించారు. వైఎస్సార్ పాదయాత్రలో జగన్ లేరని స్పష్టం చేశారు. ఒకవేళ నాటి పాదయాత్రలో జగన్ కూడా ఉన్నాడని నిరూపిస్తే ఉరేసుకోవడానికైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు.
ఇక బీజేపీ తలుచుకుంటే జగన్, కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని గోనె అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అదే నిజమైతే జగన్ జైలుకు కాక ఇంకెక్కడికి వెళతాడు? అని ప్రశ్నించారు. అటు కేసీఆర్ పైనా రెండు ఈడీ కేసులు ఉన్నాయని వివరించారు. తన జోలికి వస్తే ఎవరి బండారం బట్టబయలు చేయడానికైనా వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు.