Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు…

కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
-నీలకంఠాపురంలో పురాతన ఆలయం
-1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం
-రఘువీరా, గ్రామస్థుల కృషితో పునర్ నిర్మాణం
-ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు పవిత్ర కార్యక్రమాలు

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రాచీన ఆలయాన్ని పునర్ నిర్మించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. నీలకంఠాపురంలో ఈ ఆలయాన్ని రేపు శాస్త్రోక్తంగా పునః ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వీడియో సందేశం అందించారు.

మహోన్నతమైన ఆలోచనలతో ఆలయాల పునర్ నిర్మాణం బాధ్యతలు స్వీకరించిన రఘువీరాకు, నీలకంఠాపురం గ్రామస్థులకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 1,200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పురాతన పుణ్యక్షేత్రం ఏపీ, కర్ణాటక ప్రజలకు నెలవుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద పవిత్రమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ఇది ఎంతో మంచి సంకల్పం అని చంద్రబాబు అభివర్ణించారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకున్న రఘువీరారెడ్డి తన స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఉంటూ వ్యసాయం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భార్యతో కలిసి పోలింగ్ స్టేషన్ కు మోపెడ్ మీద వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజల దృష్టిని ఆకర్షించింది .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన రఘువీరా రాజకీయాలకు దూరంగా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. మంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన స్వంత ఊరులో ఉండటం వ్యవసాయంపై కేంద్రీకరించడం ఆశక్తిగా మారింది. గ్రామంలో ఉంటున్న రఘువీరా పురాతన దేవాలయంపై కూడా దృష్టి సారించారు.
శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించారు. రఘువీరా కృషిని గ్రామస్తులే కాకుండా ,చుట్టుపక్కలవారు సైతం అభినందిస్తున్నారు. చంద్రబాబు కూడా రఘువీరా ఆలోచనను ఆలయ పునరుద్దరని పనిని అభినందించారు.

Related posts

మునుగోడు టీఆర్ యస్ దే అంటున్న సర్వేసంస్థలు…

Drukpadam

ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

Drukpadam

తెలంగాణ సిట్ నోటీసులపై రఘురామకృష్ణరాజు స్పందన

Drukpadam

Leave a Comment