Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం… 66 మందిని రక్షించిన రెస్క్యూ టీం…

  • ఒకరి మృతి, గల్లంతైన వారి కోసం గాలిస్తున్న సిబ్బంది
  • గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళుతుండగా ప్రమాదం
  • చిన్న బోటు ఢీకొనడంతో పడవకు ప్రమాదం

ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పడవలోని మరో 66 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమాచారం రాగానే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు ప్రయాణికులతో వెళుతున్న ‘నీల్ కమల్’ పడవ మునిగిపోయింది. ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ప్రమాద సమయంలో ఈ పడవలో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

Related posts

యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు…

Ram Narayana

హైదరాబాద్ శివార్లలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

Ram Narayana

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-బస్సు ఢీ.. నలుగురి మృతి!

Ram Narayana

Leave a Comment