Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా మృతి పట్ల మాజీ ఎంపీ నామ విచారం

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా మృతి పట్ల మాజీ ఎంపీ నామ విచారం
రైతుల పక్షపాతి మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా – మాజీ ఎంపీ నామ

భారత 6వ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడు ఇండియన్ నేషనల్‌ లోక్ దళ్ అధ్యక్షుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా మృతిపట్ల బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ విచారం వ్యక్తం చేసారు. శుక్రవారం గురుగ్రామ్‌లో ఓం ప్రకాష్ చౌతాలా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేశారు వారి మరణం తీరని లోట అని అన్నారు. ఓం ప్రకాశ్‌ చౌతాలా మంచి వ్యక్తి అని 1989 నుండి 2005 వరకు హర్యానాకు ముఖ్యమంత్రిగా పని చేసారన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నామ గుర్తు చేసుకుంటూ ఆయన రైతుల పక్షపాతి అన్నారు. 15వ లోక్ సభ లో నామ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న సమయాన పలుమార్లు వారి తండ్రి చౌదరి దేవి లాల్ జయంతి వేడుకుల్లో పాల్గొనడం జరిగిందని, ఆ సభల్లో రైతులు భారీగా పాల్గొనే వారని నామ పేర్కొన్నారు. వారి కుటుంబం నుండి దాదాపు మూడు తరాల వారు ప్రజాసేవలో నే వున్నారని ఇప్పుడు నాల్గో తరం ఓం ప్రకాష్ చౌతాలా మనవడు, దుష్యంత్ చౌతాలా, జననాయక్ జనతా పార్టీ నాయకుడు, హర్యానా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ..

Related posts

క్రెడిట్ స్కోరు బలంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి!

Ram Narayana

వాట్సప్‌లో త్వరలోనే ఏఐ ఆధారిత ‘ఇమాజిన్’ ఫీచర్..

Ram Narayana

ఐటీ రెయిడ్లలో రూ.350 కోట్లు సీజ్.. తొలిసారిగా స్పందించిన ఝార్ఖండ్ ఎంపీ

Ram Narayana

Leave a Comment