Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

అరెస్ట్ ఆపండి ….విచారణ జరపండి ..కేటీఆర్ పై కేసులో హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్‌ వర్తించదని సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ సుందరం వాదనలతో హైకోర్టు ఏకీభవించింది ..ఆధారాలు సమర్పించాలని ఏసీబీకి వారం రోజుల గడువు ఇచ్చింది .. విచారణ సందర్భంగా ఏసీబీకి సహకరించాలని కూడా కోర్ట్ ఆదేశించింది ..

Related posts

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్లు…

Ram Narayana

మాగనూరు ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!

Ram Narayana

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. బడా బాబులకు చురక…

Ram Narayana

Leave a Comment