Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అంబేద్కర్‌ పై కేంద్ర మంత్రి అమిత్‌ షావ్యాఖ్యలకు అఖిలపక్షపార్టీలు ఖండన!

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ చేసిన అవమానకర వ్యాఖ్యలను అఖిలపక్ష పార్టీలు ఖండిరచాయి. పార్లమెంటులో అమిత్‌ షా ఇష్టారాజ్యంగా మాట్లాడారని, ఆయన వైఖరి రాజ్యాంగ విరుద్ధమని , ఆయనను వెంటనే భర్తరఫ్‌ చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆదివారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన ఖమ్మంలోని ధర్నా చౌక్‌ నుండి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆనంతరం జరిగిన నిరసన సభలో సిపిఎం, సిపిఐ, కాంగ్రేస్‌, యం.యల్‌. మాస్‌ లైన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, భాగం హేమంతరావు, సి.వై.పుల్లయ్య, ఎస్‌.డి.హూస్సేన్‌లు మాట్లడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే అమిత్‌షా హోంమంత్రి అయ్యారని గుర్తు చేశారు. దేశంలో కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమాజ మనుగడ ఉండకూడదని అంబేడ్కర్‌ భావించారనీ, ఆమేరకు రాజ్యాంగంలో రక్షణలు ఏర్పాటు చేశారని వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదలకు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమే రక్షణగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం ఏది పడితే అది రాజ్యాంగ సభలో మాట్లాడటం అమిత్‌ షా అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ పేరును పలకటం ఫ్యాషన్‌ కాదని, అది సమానత్వం, స్వాతంత్య్రం, సామాజిక మార్పుకు ప్రతీక అని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక దేశంలో హిందూ మతోన్మాదంతో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని, దాని ఆనవాళ్ళు లేకుండా చేయాలని అనేక ఎత్తుగడలు వేస్తూ ఏదో ఒక రూపంలో దళితులు, మైనార్టీలు, ప్రశ్నించే వారిని అణచివేస్తూ హిందూత్వ విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అంబేద్కర్‌ పేరు జపం చేసి, అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు అంబేద్కర్‌ పేరు ఎత్తుగూడదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి అనుసరిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ ఖండిరచాలన్నారు. రాబోయే కాలంలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, ప్రశ్నించేవారు పెను ప్రమాదాన్ని ఎదుర్కోవల్సి వస్తుందన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్‌, మాదినేని రమేష్‌, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, సిపిఐ నాయకులు దండి సురేష్‌, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, ఎం.ఎల్‌.మాస్‌లైన్‌ నాయకులు ఆవుల అశోక్‌, రaాన్సీ, ఎం.సుబ్బారావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మెరుగు సత్యనారాయణ, సిఐటియు నాయకురాలు పిన్నింటి రమ్య, ఖమ్మం 1టౌన్‌ కార్యదర్శి ఎస్‌.కె.నాగుల్‌మీరా, 2 టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, 3 టౌన్‌ కార్యదర్శి భూక్యా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం ఎవరు వేరు చేయలేనిది …ఎంపీ నామ

Ram Narayana

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

Ram Narayana

పువ్వాడ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదు తిరస్కరించండి… తుమ్మల

Ram Narayana

Leave a Comment