Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఐదు అంతస్తుల వరకు అనుమతులు అవసరం లేదు…మంత్రి నారాయణ

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

  • మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయన్న నారాయణ
  • వైసీపీ హయాంలో మున్సిపల్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణ
  • ఆధునిక సాంకేతికతతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి

పట్టణ ప్రాంతాల్లో ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఇతర శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పట్టణాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, వరదనీరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత పన్ను బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

వైసీపీ హయాంలో మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించారని నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. వైజాగ్ లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక విధానంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.

Related posts

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు ఖమ్మం బంద్

Drukpadam

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సస్పెన్షన్ కు విహెచ్ ఎస్ డిమాండ్ …

Drukpadam

తమిళనాడు సీఎం స్టాలిన్ పూర్వికులది ప్రకాశం జిల్లా చేరుకొమ్ముపాలెం!

Drukpadam

Leave a Comment