Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అభివృద్ధిలో ఖమ్మంపై తుమ్మల ముద్ర …ఖమ్మానికే మణిహారం “తీగల”వంతెన..!

ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గత 40 సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మనగరంపై ప్రత్యేక ద్రుష్టి సారించారు ..ఇప్పటికే తన దృష్టికి వచ్చిన అభివృద్ధి పనులను చేపట్టిన తుమ్మల ఖమ్మం నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు …ఖమ్మంలో నూతనంగా మెడికల్ కాలేజీ భవనాలు నిర్మించడంతోపాటు , మున్నేరు వద్ద నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జిని త్వరగా పూర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు ..ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తీసుకునే వచ్చేందుకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించారు …సారధి నగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని పూర్తీ చేయించారు ..వివిధ డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి ,సంక్షేమ పథకాలు అమలు కోసం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు …మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు , బస్సు డిపో రోడ్ లో గత ప్రభుత్వంలో ఇరుకుగా ఉన్న రోడ్ లో ఏర్పాటు చేసిన డివైడర్ ను తొలగించి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనలో ఉన్నారు .. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు …గతంలోనే ఆయన ఆధ్వరంలోనే తెచ్చిన నేషనల్ హైవే లకు రింగ్ రోడ్ అనుసంధానం చేయాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు …

ఖమ్మం నగరంలో నిర్మిస్తున్న తీగల వంతెన ఖమ్మం గుమ్మానికి మణిహారంగా నిలుస్తుందని, యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరులోగా తుది హంగుల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర తుమ్మల ఆదేశించారు. అండ్ బి శాఖ అధికారులు, తీగల బ్రిడ్జి నిర్మాణ సంస్థ అశోక బిల్డకన్ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరం రాజధాని తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మున్నేరు తీగల వంతెన అద్భుతమైన ఆకర్షణతో ఖమ్మానికి ల్యాండ్ మార్క్ కాబోతోందన్నారు. డిసెంబర్ 31-12- 2025 లోగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే విధంగా నిర్మించిన తీగల వంతెనను కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ వంతెనతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు ఖమ్మం అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. జనవరిలో అట్టహాసంగా ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని నిర్వహించేలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం నగరంలోని సూర్యాపేట అశ్వరావుపేట ప్రధాన రహదారిలో 57/150 -58/400 రహదారిపై ఈ తీగల వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహారాష్ట్ర నాసిక్ చెందిన ఎంఎస్ అశోక బిల్డకన్ సంస్థ 180.00 కోట్లతో ఈ బ్రిడ్జిని 24 నెలల కాలంలో శరవేగంగా నిర్మిస్తుందని మంత్రి కితాబు ఇచ్చారు. మొత్తం 16 ఫౌండేషనల్లో 12 ఫౌండేషన్లు పిఆర్ మరియు బెడ్ బాక్సులతో సహా పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. స్లాబ్ సెగ్మెంట్స్ నిర్మాణం పూర్తయ్యాయని మిగిలిన పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ ని దారిమళ్లించేందుకు డైవర్షన్ రోడ్డును పాత వంతెనకు సమాంతరంగా నిర్మాణం చేపడుతున్నామని వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. డైవర్షన్ రోడ్డు పాత కాజ్ వే ని తారు రోడ్డు నిర్మించాలని మంత్రి ఆదేశించారు. వర్షాకాలంలో కూడా ట్రాఫిక్ నియంత్రణకు పాత వంతెనను వాడుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని బైపాస్ రోడ్ లో గల ఆర్ అండ్ బి బ్రిడ్జ్, ప్రకాష్ నగర్ లోని వంతెన మరమ్మత్తులతో పాటు అన్ని వంతెనల మరమ్మత్తులు శరవేగంగా చేపట్టాలన్నారు. నగరంలోని అన్ని డివైడర్స్ మరమ్మత్తులు చేపట్టాలని అలాగే చిన్న పరిమాణంలో ఉన్న డివైడర్స్ను పోలీస్ శాఖ సహకారంతో నిర్మించాలన్నారు. అన్ని వంతెనలు ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రశాంతమైన ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుమారుని వివాహం ..హాజరైన కేటీఆర్ ,హరీష్ రావు

Ram Narayana

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

Ram Narayana

పండగపూట ఆత్మీయుల ఇళ్లకు అనుకోని అతిధి!

Ram Narayana

Leave a Comment