Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో మరో 2 కార్పొరేషన్లు ,13 మున్సిపాల్టీలు ఏర్పాటు ..

పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది.

దీంతో రాష్ట్రంలో 13 కార్పొరేషన్లు ,142 మున్సిపాల్టీలు కానున్నాయి…అర్బన్ ప్రాంతాలు పెరగనున్నాయి …మరికొన్ని కార్పొరేషన్లు , మున్సిపాల్టీల్లో సమీప గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉంది …

మున్సిపల్ కార్పొరేషన్లుగా మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను అప్‌గ్రేడ్ చేస్తారు… కొత్త మున్సిపాలిటీలు: కోహీర్, గడ్డిపోచారం, గుమ్మడిదల , ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా); కేసముద్రం (మహబూబాబాద్); స్టేషన్ ఘన్‌పూర్ (జనగాం ); మద్దూరు (నారాయణపేట); ఏదులాపురం (ఖమ్మం); అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం) చేవెళ్ల మొయినాబాద్ రంగారెడ్డి జిల్లాలోనివి ఉన్నాయి …ఖమ్మం జిల్లాలోని కల్లూరును కూడా మున్సిపాలిటీ చేస్తామని ఇటీవల రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు …దీంతో ఖమ్మం జిల్లాలో రెండు కొత్త మున్సిపాల్టీలు కానున్నాయి… మరికొన్ని మున్సిపాల్టీల ప్రతిపాదనలు వచ్చినా జనాభా , వీలైన గ్రామాల భౌగోళిక స్వరూపం లాంటివి నుంచి అభ్యంతరాలతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది ..

రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలను కూడా మున్సిపాల్టీల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. పరిగి మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు, నర్సంపేట మున్సిపాలిటీలో ఏడు, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఒక్కో గ్రామం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆరు గ్రామాలు విలీనం కావాల్సి ఉంది.

Related posts

నా పదవి పోయినా సరే…: బెల్టు దుకాణాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Ram Narayana

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై డీకే శివకుమార్ క్లారిటీ …

Drukpadam

కొత్త రకం సైబర్ స్కామ్.. అప్రమత్తత ప్రకటించిన తెలంగాణ పోలీసులు!

Ram Narayana

Leave a Comment