Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారె ప్రసక్తే లేదు … టీఆర్ యస్ ఎంపీ నామ!

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారె ప్రసక్తే లేదుటీఆర్ యస్ ఎంపీ నామ!
నేను సంస్థలోనూ డైరెక్టర్ గా లేను.. ఈడీ నోటీసులపై తొలిసారి నామా 
తనకు నోటీసులివ్వడంపై నామా ఆవేదన
ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదని వ్యాఖ్య
కేసీఆరే తన బలమన్న ఖమ్మం ఎంపీ

టీఆర్ యస్ కు చెందిన నామ నాగేశ్వరరావు పై పార్టీ మారాలనే వత్తిడి వస్తుందా ? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీఆర్ యస్ లోకసభ పక్ష నేతగా ఉన్న నామ లోకసభ చర్చల్లో చాల యాక్టివ్ గా ఉండే నేతల్లో ఒకరుగా ఉన్నారు …. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ యస్ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చాల బలంగా లోకసభలో వినిపిస్తున్న నేతగా పేరుంది ….అందువల్ల ఆయన పై బీజేపీ కన్నేసిందా ? అందుకనే డి ,సిబిఐ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . తెలంగాణాలో 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఎత్తులు వేస్తున్న బీజేపీ బెంగాల్ తరహాలో టీఆర్ యస్ నుంచి కొందరు ముఖ్యనేతలపై గురిపెట్టారు . అందులో కొంతమంది ఎంపీలు కూడా ఉన్నట్లు గుసగుసలు …. అందువల్ల నామ పార్టీ మారేలా వత్తిడి తెస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ మారితే కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా కల్పిస్తామని ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది

నామకు ఇటీవల ఈ డి సమన్లు జారీచేసింది . తాను ఏ సంస్థలోనూ డైరక్టర్ కానప్పటికీ తనకు నోటీసులు ఇవ్వడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది తీవ్ర అభ్యంతరకర విషయమని తనను ఎంతో వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఆయినా ప్రాజక్టుల్లో నిధులు మళ్లించే అవకాశమే లేదని ,మళ్ళించని నిధులపై మళ్లించినట్లు జరుగుతున్నా ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారానని , కేసీఆర్ తనకు బలమని పేర్కొన్నారు….

తాను ఏ సంస్థలోనూ డైరెక్టర్ గా లేనని, అయినప్పటికీ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని నామా నాగేశ్వరరావు తెలిపారు . జార్ఖండ్ లో మధుకాన్ కంపెనీ చేపట్టిన రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాల్లో కొంత మొత్తాన్ని అక్రమమార్గాల్లో మళ్లించారన్న ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులపై ఆయన తొలిసారి స్పందించారు.

20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉంటున్నానని, 40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించానని చెప్పారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టామన్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ వే ఎస్పీవీ కంపెనీ.. బీవోటీ పద్ధతిలోనే రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టును చేపట్టిందన్నారు. అయితే, పలు విచారణల కారణంగా హైవే అభివృద్ధిపై సంస్థ వెనక్కు వెళ్లిందన్నారు. ఎస్క్రో ఖాతాపై బ్యాంకుకే పూర్తి అధికారం ఉందన్న ఆయన.. తాను సంస్థ డైరెక్టర్ గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదని మళ్ళించని నిధుల గురించి ఎప్పుడో జరిగిన విషయాన్నీ గురించి కొత్తగా ఈ డి చర్యలు అసంబద్దము అన్నారు. . తన బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలేనని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పటం కోసం మెరుపు …

Related posts

ఏపీ లో కొత్త జిల్లాల పేర్లు , జిల్లా కేంద్రాలపై రగులుతున్న చిచ్చు!

Drukpadam

ప్రతిపక్షాల ఐక్యతకు హస్తినలో మమతా కుస్తీ…

Drukpadam

ప్రశాంత్ కిషోర్ తో చర్చించించి దండగ అని వదిలేశాం :ప్రియక గాంధీ

Drukpadam

Leave a Comment