Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సమస్యలు పరిష్కరిస్తాం…బెనిఫిట్ షోలు టికెట్స్ పెంపుదల ఉండదన్నసీఎం రేవంత్ రెడ్డి !

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట మహిళ మృతి ,అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు …హైద్రాబాద్ బంజారాహిల్స్ లోగల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ,డీజీపీ , హోమ్ సెక్రటరీ , సినీ పరిశ్రమకు చెందిన 46 మంది పెద్దలు పాల్గొన్నారు …వీరిలో రాఘవేందర్ రావు ,మురళి మోహన్ ,అక్కినేని నాగార్జున ,దగ్గుపాటి సురేష్ బాబు , వెంకటేష్ , అల్లు అరవింద్ ,తదితరులు ఉన్నారు …ఈ సమావేశంలో ప్రత్యేకమైన నిర్ణయాలు జరగనప్పటికీ సినీ పెద్దలకు సమస్యలు పరిష్కరిస్తామనే భరోసా సీఎం ఇచ్చారు …అందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని అందులో అధికారులు సినీ ప్రముఖులకు చోటు కల్పిస్తామని తెలిపారు … ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు. ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. అదే సందర్భంలో బెనిఫిట్ షో లు , టికెట్స్ పంపును అంగకరించబోమని తేల్చి చెప్పారు సీఎం … శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు… ఈ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన గురించి సినీ ప్రముఖులకు వీడియో చూపించి మహిళ మృతి పై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు …బౌన్సర్ల ఓవర్ యాక్షన్ పై మండిపడ్డారు ..ఘ‌ట‌న‌లో థియేట‌ర్ యాజ‌మాన్యంతో పాటు హీరో బాధ్యతరాహిత్యంగా వ్య‌వ‌హరించార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మ‌హిళ ప్రాణాలు కోల్పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు సీఎం తెలిపారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాల‌ని సూచించారు. సినీ ఇండ‌స్ట్రీకి త‌ప్ప‌కుండా సామాజిక బాధ్య‌త ఉండాల‌ని సీఎం తెలిపారు. శాంతిభ‌ద్ర‌త‌లు, ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వానికి ముఖ్య‌మ‌న్నారు. తెలంగాణ‌లో ఇక‌పై బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపు ఉండ‌వ‌ని సినీ ప్ర‌ముఖుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని రేవంత్ స్పష్టం చేశారు. ఉద్దేశ పూర్వకంగా కేసులు పెట్టలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణలో షూటింగ్స్ కు మరిన్ని రాయితీలు ఇవ్వాలన్న విన్నపంపై కమిటీ వేస్తామని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలని సూచించారు. సినిమా రిలీజ్, ఈవెంట్స్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేని చెప్పారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని అన్నారు. ఇన్వెస్ట్ మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు.

హైద్రాబాద్ ను ప్రపంచ సినీ డిస్టినేషన్ గా తీర్చి దిద్దాలని సీఎం సినీ ప్రముఖులకు దిశా నిర్దేశం చేశారు …ఇక్కడ ఉన్న అవకాశాలు మరెక్కడా లేవని అవకాశాలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నుంచి అందుకు కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు ..

స‌మావేశం ముగిసిన త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్ వేదిక‌గా) ఒక పోస్టు పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింద‌ని తెలిపారు.

ఇక ఈ భేటీలో ప్ర‌ముఖ నిర్మాత‌, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ మాట్లాడారు. ముందుగా ప్ర‌భుత్వాన్ని క‌లిసే అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలుగు నిర్మాత‌ల‌కు ఈరోజు శుభ‌దినంగా పేర్కొన్నారు. హైద‌రాబాద్‌ను వ‌ర‌ల్డ్ షూటింగ్ డెస్టినేష‌న్‌గా మార‌డానికి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌న్నారు.

భాగ్య‌న‌గ‌రం షూటింగ్‌ల‌కు చాలా అనువైన‌ ప్ర‌దేశంగా ముంబ‌యి వాళ్లు చెబుతుంటార‌ని, దానికి ఒక కార‌ణం వారి ద‌గ్గ‌ర కంటే మ‌న ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య త‌క్కువ‌గా ఉండ‌డ‌మే అని తెలిపారు. అలాగే సంధ్య థియేట‌ర్ లాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని అల్లు అర‌వింద్ ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చారు.

అలాగే ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ… అంద‌రూ ముఖ్య‌మంత్రుల లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా త‌మ‌ను బాగానే చూసుకుంటున్నార‌ని అన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా దిల్ రాజును నియ‌మించ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ‌లో అద్భుత‌మైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయ‌ని తెలిపారు.

గ‌తంలో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో చిల్డ్ర‌న్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా రాఘ‌వేంద్రరావు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

భాగ్య‌న‌గ‌రం షూటింగ్‌ల‌కు చాలా అనువైన‌ ప్ర‌దేశంగా ముంబ‌యి వాళ్లు చెబుతుంటార‌ని, దానికి ఒక కార‌ణం వారి ద‌గ్గ‌ర కంటే మ‌న ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య త‌క్కువ‌గా ఉండ‌డ‌మే అని తెలిపారు. అలాగే సంధ్య థియేట‌ర్ లాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని అల్లు అర‌వింద్ ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చారు. ఇంకా అక్కినేని నాగార్జున ,దగ్గుపాటి సురేష్ బాబు దిల్ రాజు ,పలు సూచనలు చేశారు ..

Related posts

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యత్ …రేవంత్ …!

Drukpadam

కులగణనలో పాల్గొనలేదా? ఫోన్ చేస్తే ఇంటికి ఎన్యుమరేటర్లు!

Ram Narayana

25 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment