Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బాక్సింగ్ డే అంటే ఏమిటి? క్రిస్మస్ తర్వాతి రోజునే ఎందుకు జరుపుకుంటారు?

  • నేడు ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ డే సెలబ్రేషన్స్
  • నిరుపేదలు, సేవకులకు యజమానులు బాక్స్‌ల్లో పెట్టి బహుమతులు అందించడం ఆచారం
  • 19వ శతాబ్దంలో యూకేలో ప్రారంభమైన సంప్రదాయం
  • ఆ రోజున గిఫ్ట్ బాక్సులు తెరుస్తారు కాబట్టి ‘బాక్సింగ్ డే’గా ప్రఖ్యాతి

ఇవాళ (డిసెంబర్ 26) ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. క్రైస్తవ మతస్తులు పరిశుద్ధమైనదిగా భావించే ‘బాక్సింగ్ డే’ అంటే ఏమిటి?, క్రిస్మస్ మరుసటి రోజునే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? అనే సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా..! అయితే, ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.

క్రైస్తవులు పాటించే ఒక ఆచారమే బాక్సింగ్ డే. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుండగా… మరుసటి రోజు అంటే డిసెంబర్ 26న నిరుపేదలు, సేవకులకు బహుమతులు, కానుకలు అందజేయడం ఒక సంప్రదాయం ముఖ్య ఉద్దేశం. బాక్సింగ్ డే అనే పదం ‘క్రిస్మస్ బాక్స్’ అనే పదం నుంచి వచ్చింది. ధనికులు, సంపన్నులు తమకు సేవలు అందించే పనివారికి, నిరుపేదలకు ‘క్రిస్మస్ బాక్స్’ల్లో పెట్టి బహుమతులు అందజేస్తుంటారు. 

యజమానుల నుంచి అందిన బహుమతి బాక్సులను తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో గడిపేందుకు సేవకులకు ఆ రోజు సెలవులు ఇస్తారు. ఆ రోజున బహుమతుల బాక్సులను తెరుస్తుంటారు. అందుకే క్రిస్మస్ మరుసటి దినాన్ని ‘బాక్సింగ్ డే’గా పాటిస్తారు. 19వ శతాబ్దంలో యూకేలో క్వీన్ విక్టోరియా ఉన్నప్పుడే ఈ ఆచారం ప్రారంభమైంది.

బాక్సింగ్ డేకి సంబంధించి మరో సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. పేదల కోసం డబ్బు, కానుకలు స్వీకరించేందుకు చర్చిలో ఉంచిన బాక్స్‌ను క్రిస్మస్ మరుసటి రోజున తెరుస్తారు. అందులోని బహుమతులను పేదలకు పంచి పెడతారని, అందుకే బాక్సింగ్ డేగా పాటిస్తారని చెబుతుంటారు.

కాగా, బాక్సింగ్ డేను ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌తో పాటు అనేక ఇతర కామన్వెల్త్ దేశాలలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం బాక్సింగ్ డే షాపింగ్‌లకు ప్రసిద్ధమైనదిగా మారిపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సంతోషంగా విందులు చేయడం వంటి ట్రెండ్ కనిపిస్తోంది.

Related posts

కరోనాలో కొత్త వేరియంట్… 27 దేశాలకు వ్యాప్తి!

Ram Narayana

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. తదుపరి అధ్యక్షుడిగా దిస్సనాయకే!

Ram Narayana

షేక్ హసీనాను అరెస్ట్ చేసి అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోయేషన్

Ram Narayana

Leave a Comment