ఆఫ్ బీట్ వార్తలు

“మా అత్తను త్వరగా చంపు తల్లీ” అంటూ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు!


కొత్తగా మొక్కుకునే వారు, మొక్కు చెల్లించుకునే వారు ఆలయాల్లోని హుండీల్లో కానుకలు వేయడం తెలిసిందే. కొందరు నగదు రూపంలో, కొందరు వస్తు రూపంలో హుండీలో కానుకలు వేస్తుంటారు. అయితే, కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. 

అమ్మా… మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మును లెక్కిస్తుండగా ఈ నోటు కంటబడింది. అయితే, అత్తను చంపమని రాసింది కోడలో, మరి అల్లుడో తెలియదు కానీ… ఆ నోటు మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related posts

పుట్టినప్పుడే విడిపోయి 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు

Ram Narayana

రాత్రివేళ ఇళ్లలోకి దూరి నిద్రిస్తున్న మహిళల తలపై కొట్టి పారిపోతున్న యువకుడు!

Ram Narayana

పెళ్లైన మూడో రోజే విడాకులు.. శోభనం రాత్రే భర్త గుట్టురట్టు!

Ram Narayana