భూ భారతి తో భూ సమస్యలు మొత్తం పరిష్కారం కావు…
సమగ్ర భూ సర్వే చేపట్టాలి
మంత్రి వర్గ ఉప సంఘం సమావేశాలు పేరుతో రైతు భరోసా జాప్యం తగదు
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి -2024 కేసిఆర్ ప్రభుత్వం రూపొందించిన ధరణి -2020 కంటే మెరుగైన ఆర్వో ఆర్ గా ఉండవచ్చు కానీ భూ సమస్యలు మొత్తం పరిష్కారం చేయలేదు అని , సమగ్ర భూ సర్వే మాత్రమే భూ సమస్యలు కు సమగ్ర పరిష్కారం అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
సోమవారం ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో లో భూములు సమగ్ర సర్వే నిజాం కాలంలో జరిగింది అని అప్పటి నుంచి భూములు అనేక మంది చేతులు మారి పట్టా ఒకరు పేరుతో ఉండి సాగులో మరొకరు ఉన్న పరిస్థితుల్లో సమగ్ర సర్వే చేసి అనుభవం ఆధారంగా హద్దులు నిర్ణయించి ప్రతి కమతానికీ భూధార్ నెంబర్ ఇచ్చి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని కోరారు . కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఆహ్వానించే పరిణామం అన్నారు, అనుభవదారు కాలం తోపాటు కౌలు రైతుల గుర్తింపు కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది అన్నారు.
రైతు భరోసా విధివిధానాలు రూపకల్పన పేరుతో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశాలు పేరుతో కాలయాపన చేయకుండా
రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలి అని రాంబాబు డిమాండ్ చేశారు, శాటిలైట్ చాయా చిత్రాలు ఆధారంగా రైతు భరోసా ఇవ్వడానికి వానాకాలం పంట, రబీ సీజన్లో పంట ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని అన్నారు, స్తానిక వ్యవసాయ అధికారులు సాగు సర్వే ప్రకారం రైతు భరోసా రెండు సీజన్ లో తక్షణమే విడుదల చేసి రైతుల బ్యాంకు ఎకౌంటు కు జమచేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కరరావు, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ, సహాయ కార్యదర్శులు చింత నిప్పు చలపతిరావు, రచ్చా నరసింహారావు,బిక్కసాని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు…