Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నూతన సంవత్సర వేడుకలు హద్దులు దాటొద్దు …సీపీ సునీల్ దత్

నూతన సంవత్సర వేడుకలలో
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ..ఖమ్మం కమిషనరేట్ లో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సున్నితమైన ప్రాంతాలలో పోలీసు పికెట్‌లతో పాటు మతపరమైన ప్రార్థనా స్థలాలు, ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్‌బండ్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు తదితర పబ్లిక్‌ పార్కుల్లో పోలీసు పెట్రోలింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్. తగ్గించేందుకు ప్రధాన రహదారులపై వెహికల్‌ చెకింగ్‌ నిర్వహించాలని, బాణసంచా పేల్చడాన్ని నిషేధించాలి..పోలీస్ అధికారులకు ఆదేశించిట్లు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర మొదటి రోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైక్స్/ కార్లను ఇస్తే అయా వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం,మత్తు పదార్థాలు సేవించి నడపడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తల్లితండ్రులు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు తో పాటు ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కాబట్టి 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట తరువాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉండే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంటలోపు పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100 చేయాలని సూచించారు.

Related posts

ఖమ్మంలో కాంగ్రెస్ , బీఆర్ యస్ , బీజేపీ మధ్య తీవ్ర పోటీ

Ram Narayana

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు …రెండుగా చీలిన అధికార పార్టీ డైరక్టర్లు

Ram Narayana

Leave a Comment